కలలను దెబ్బతీస్తున్నా

by Ravi |   (  Updated:2025-09-28 23:31:04  IST  )

Poem

కలలను దెబ్బతీస్తున్నా
X

న్యాయ మందిరాల గోడల మధ్యన

నిశ్చయాల స్వరాలు బంధింపబడ్డాయి,

కలల రెక్కలు కోసుకున్నా

మనసు మాత్రం ఓటమి అంగీకరించలేదు.

ప్రతి నోటీసు – ఒక గాయం,

ప్రతి వాయిదా – ఒక కత్తి,

TGPSC ఒత్తిడి,

ప్రభుత్వపు నిర్లక్ష్యం –

కలలను దెబ్బతీస్తున్నా

విద్యార్థి హృదయం మాత్రం లొంగలేదయ్యా!

వీధి దీపం కింద చదివిన పేజీలు,

విరిగిన కలలపై వర్షంలా కురుస్తున్న కన్నీళ్లు,

అన్నీ ఒకరోజు

జయధ్వనులుగా మారతాయని నమ్మకం

ఈ పోరాటానికి ప్రాణం.

కోర్టుల కంచెలలోనైనా,

ఒత్తిడుల అంధకారంలోనైనా

ప్రతి అభ్యర్థి ఒక అగ్నిపుంజమే,

నిజాయితీతో నిండిన సమాధాన పత్రమే

వారి ఆయుధం.

ప్రభుత్వం తల వంచి వినే

రోజు రానే వచ్చింది

కలల పుటల్లో రాసుకున్న

గ్రూప్-1 అధికారి అనే పదం

వారి సొంతమయింది!...

-గుమ్మడి దారి సాయికృష్ణ

90142 52482

Next Story