- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

రక్తమనే సిరాతో రాసిన స్వప్నం,
భగత్ సింగ్ అనే జ్వాలగా వెలిగిన దీపం.
బానిస సంకెలలలో మూలుగుతున్న భారతం,
బాంబు కంటే ఘోషించినది ఆయన గళం.
గుళ్ల కంటే గర్జించినది ఆయన నినాదం,
"ఇక్విలాబ్ జిందాబాద్!" అనే జ్వాల బాణం.
జాతి రక్తంలో రగిలే అగ్ని కిరణం,
జైలు గోడల మధ్యలో గానం చేసిన సత్యం,
ప్రాణాల కంటే గొప్పది దేశం అనే మంత్రం.
స్వాతంత్ర్య తపనలో రగిలిన అగ్ని శిఖరం,
బ్రిటిష్ గుండెలలో నింపేను భయం
బ్రిటిష్ బానిసత్వానికి లొంగని తత్త్వం
దేశ స్వాతంత్య్రం కోసం చావడానికి సిద్ధం
దాస్యాసృంకలాలు తెంపడమే పంతం
బానిత్వానికి లొంగని తత్త్వం
ఉరి తాడును మద్దాడిన దైర్యం
యువ్వన వయసులో చేసిన మహా త్యాగం.
దేశ చరితలో యుగయుగాలు అజరామరం
త్యాగంతో భారతమాత తల ఎత్తే గౌరవం
స్వేచ్ఛ కోసం ఆయన మరణం ఒక దీపం,
తల్లి కడుపులో పుట్టిన సాధారణ కుమారుడు,
జాతి కోసం త్యాగం చేసిన అమర వీరుడు.
ప్రాణం పోయినా ఆత్మ రగిలే జ్వాల,
భారత చరిత్రలో ఎప్పటికీ నిలిచే దీపమాల.
ప్రాణం కన్నా దేశం గొప్పదని చెప్పిన సింగ్,
జాతి జ్ఞాపకంలో చిరంజీవిగా నిలిచిన భగత్ సింగ్.
(నేడు భగత్ సింగ్ జయంతి)
-దుప్పటి మొగిలి
84668 27118
- Tags
- Poem






