- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
రాత్రే కాదు
పగలు కూడా చీకటి కమ్మేసి
మస్తిష్కాన్ని కప్పేస్తుంది
కొన్ని నమ్మకాలు
అమావాస్య నిశీధిలో
వెలుతురు కోసం వెతుకుతాయి
మరికొన్ని బంధాలు
అవసరం కోసం
గ్రహణంలా కమ్ముకుంటాయి
చీకటి సాక్షిగా
వెల్తురులో కూడా
కొన్ని కనిపించవు
మరికొన్ని వినిపించవు
రాత్రి నిజం కావచ్చు
పగలు అబద్దమై అనిపించొచ్చు
మనో నేత్రం చురుకైనప్పుడు
చీకటి కూడా దారినిస్తుంది
నింగి చూపుతో
నేలను మరచి నడిచినప్పుడు
వెలుతురు కూడా
చీకటిగానే కనిపిస్తుంది
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636
- Tags
- Poem
Next Story






