- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మా ఊరు పూల తోట
అయిపోయింది బతుకమ్మ,
తొమ్మిది రోజులు కొలిచేము బతుకమ్మ,
పడుచులందరూ పట్టు చీరలలో
బంగారు చిలకలవుతారు బతుకమ్మ,
కోకిలలై పాడుతారమ్మ బతుకమ్మ,
సత్యమై నిలుచునమ్మా బ్రతుకమ్మ
మా జ్ఞాపకాలలో సజీవమై
నిలుచునమ్మా బతుకమ్మ
పొరలు కమ్మిన మనుషులకు
కనువిప్పు బతుకమ్మ,
ప్రతి ఇంటిలో బంధమైంది బతుకమ్మ,
ఆడపడుచుల బ్రతుకు చిత్రమైంది బతుకమ్మ,
బ్రతుకు బాటలో బంధాలు నిలుపునమ్మా
మా ఇంటి బతుకమ్మ,
నిండైన రూపంతో నవనవలాడుతుంది బతుకమ్మ,
స్వాభిమానం అణువణువునా నిలుపుకుంది బతుకమ్మ,
బ్రతుకులో బ్రతకడం చూపించింది బతుకమ్మ,
త్యాగాల పల్లకి అయ్యింది బతుకమ్మ,
మా గారాల పట్టి అయి నిలిచింది బతుకమ్మ,
అనుబంధమై వచ్చింది బతుకమ్మ,
మా ఇంట నవ్వుల పంటై విరబూసింది బతుకమ్మ,
పసిపాపల కళ్ళల్లో వెలుగైంది బతుకమ్మ,
మురిపాల చుక్కై మురిపిస్తుంది బతుకమ్మ,
ప్రతిసారి పసిడి పాపయి
వస్తుంది బతుకమ్మ,
పాలపిట్టై పోతుంది బతుకమ్మ
వెళ్లి రావమ్మ చల్లంగా
మళ్లీ రావమ్మ మా ఇంటి దీపంగా
మా తల్లి బతుకమ్మ,
-నారగోని ప్రవీణ్ కుమార్
98490 40195
- Tags
- Poem






