బతుకమ్మ పాట

by Ravi |   (  Updated:2025-09-21 23:16:01  IST  )

Poem

బతుకమ్మ పాట
X

బతుకమ్మ పండుగ ఉయ్యాలో

మన తెలంగాణలో ఉయ్యాలో

వాడ వాడ లోన ఉయ్యాలో

పల్లె పల్లె లోన ఉయ్యాలో

పూలన్ని జమ చేసి ఉయ్యాలో

బతుకమ్మ పేర్చేము ఉయ్యాలో

ముదితలంతా గూడి ఉయ్యాలో

ముద్దు ముద్దుగా నడిచి ఉయ్యాలో

ఊరి కోవెల చేరి ఉయ్యాలో

ఉయ్యాల పాటలు ఉయ్యాలో

పాడుతూ ఆడేరు ఉయ్యాలో

పెత్రామాస మొదలు ఉయ్యాలో

సద్దుల బతుకమ్మ దాక ఉయ్యాలో

నవరాత్రి దినములు ఉయ్యాలో

పండుగే అతివలకు ఉయ్యాలో

తీరొక్క సద్దులతో ఉయ్యాలో

నైవేద్యమే పెట్టి ఉయ్యాలో

పసుపుతో గౌరమ్మ ఉయ్యాలో

బతుకమ్మలో పెట్టి ఉయ్యాలో

ఆఖరి దినమున ఉయ్యాలో

నీళ్లల్ల విడిచేరు ఉయ్యాలో

పోయిరా బతుకమ్మ ఉయ్యాలో

పోయిరా అంటూనే ఉయ్యాలో

పసుపు గౌరమ్మను ఉయ్యాలో

ముత్తైదువలకు పంచి ఉయ్యాలో

మహాలక్ష్మిలా తిరిగే ఉయ్యాలో

మగువలంతా కలిసి ఉయ్యాలో

మన తెలంగాణలో ఉయ్యాలో

బతుకమ్మ పండుగ ఉయ్యాలో

బహు బాగా జరిగేను ఉయ్యాలో

-బొమ్మిదేని రాజేశ్వరి,

90527 44215

Next Story