- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఈ గది చాలా బిగుతుగా వుంది
ఇందులో నుండి బయటపడి
విశాల మైదానాల్లోకి..
గడ్డి పూల వనాల్లోకి నేను వెళ్ళాలి
ఇక్కడంతా మనుషుల
నీడలు నిండి వున్నా
ఎవరూ యింకొకరితో మాట్లాడరు
నక్షత్ర రాత్రులు
వెన్నెల వానలు యీవైపు రావు
ఎండిపోయిన ఆకాశం గది పైన
తీవ్రంగా వుంది
ఈ డబ్బు గోడలు
నా దేహానికి శిలువను
బహుమతిగా యిచ్చాయి
కానీ ఒక రోజు వస్తాను
ఈ గదిని దాటి
ఎక్కడెక్కడో పడి వున్న
నా కాళ్లను, చేతిని, హృదయాన్ని
ఏరి వాటిని సమాధిలో పెట్టేసి !
గుబ్బల శ్రీనివాస్, ముంబయి
89066 97777
- Tags
- Poem
Next Story






