నిత్య అన్వేషి

by Ravi |   (  Updated:2025-09-14 23:15:31  IST  )

Poem

నిత్య అన్వేషి
X

ఎన్నో ఆలోచనలు

రోజూ కొత్త కొత్తగా

అవి కోరికలా ఆశయాలా

అసంతృప్తినా అన్వేషణనా!

ఎప్పుడూ..

చైతన్యానికి స్వాగతం

ఎన్నడూ..

అచేతనం ఆహ్వానించకూడదు!

ఎదగాలి విస్తరించాలి గాలిలా

ఆకాశంలా అనంతమైన గొడుగులా!

వెలిగే సూర్యుడు

విశ్రాంతి తీసుకుంటాడా

తిరిగే భూమి

తీరిక చేసుకుంటుందా!

నీ సృష్టి..

మరో సృష్టికి కారణమవ్వాలి!

నీ అన్వేషణ

ప్రశ్నలకు పరిష్కారాలను ప్రసవించాలి!

చేతినిండా పని సంతోషం

పనిలేని తీరిక ఆనందమా?

సాగిపోవడమే అత్యంత ఇష్టం

ఆగిపోవడం అనుసరణీయమా?

నిత్య అన్వేషి

నిత్య సంతోషి కాదా!

-జగ్గయ్య.జి

9849525802

Next Story