- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఏడున్నర దశాబ్దాల జీవితం
నడుస్తూ... పరుగెడుతూ
సా.. గు.. తున్న జీవనయానం
విశ్వవ్యాపితమై... వితరణ శీలియై
విత్తు నుంచి విశ్వాంతరాల వరకు
విస్తరించిన ఓ వనితా
ఆకాశంలో సగం నీవే...
ఏది ఎక్కడ అని ప్రశ్నిస్తే..
శూన్య పాత్ర... నీకు జవాబు
పురాతన వివక్షకు..
ఆధునిక నాగరికతను అద్ది
రంద్రాలు పడిన రక్షణ చట్టాలు
సేదనిచ్చే మహా వృక్షాలు
అక్కడ నువ్వే.... ప్రకృతిగా
అయినా.... కోపిస్తే... ప్రకోపిస్తే
మేమెంత... పాలిచ్చే... పాలించే
తల్లి పిడికిలి బిగిస్తే....
సునామీలు రావా...
శూన్యం సిగ్గు పడదా
స్త్రీ నీడ లేని పురుష జాతి ఏది?
అయినా.... నువ్వు లేనిదేక్కడ మ్మా
పురుష అహంకారం కానీ....
-భమిడిపాటి గౌరిశంకర్
94928 58395
- Tags
- Poem
Next Story






