డప్పు

by Ravi |   (  Updated:2025-09-07 20:30:36  IST  )

Poem

డప్పు
X

జాతరైనా, తిరునాళ్లయినా

పండగైనా, పబ్బమైనా

చావైనా, చాటింపైనా

డప్పు మోగాల్సిందే!

గమకాలు, గమనాలు

స్వరాలు, తాళాలు

జనాన్ని కదిలించే

ఉత్తేజాలు..ఉత్ప్రేరకాలు!

డప్పంటే -

ఓ వాయిద్య పరికరం

మాత్రమే కాదు

స్వర సృజనకు జీవం పోసిన

తొలి సాధనమది!

డప్పు-

శ్రమజీవుల

గుండె చప్పుడై ధ్వనిస్తుంది

దరువుల శబ్ద గర్జనై

ప్రతిధ్వనిస్తుంది!

జనగళమై ప్రశ్నిస్తుంది

బహుజనుల అస్తిత్వమై

నిలదీస్తుంది!

ఆటా పాటలకు ఆ'దరువై'

ఆడిస్తుంది..పాడిస్తుంది!

డప్పు -

ఓ చైతన్య ఝురి

జాగృతి పరిచే శబ్ధ భేరి!

ధవళేశ్వరపు రవికుమార్

98487 12197

Next Story