- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఎర్రబస్సు ఎరుగని మా ఊరు..
నేడు ఎదురుచూసే వారేలేరు
రౌండ్ టేబుల్ మీటింగులు లేక
రాలుతున్న రావి చెట్టు ఆకులు
పెద్ద మనుషుల ముచ్చట్లులేక
అలిగి కూర్చున్న అరుగులు
ఇంటి ముందర పందిరి లేక
ఎండిపోయిన దర్వాజలు
చిర్రగోనే ఆటలు లేక
కాలిబాటల కన్నీళ్లు
అమ్మలక్కల లొల్లి లేక
వాడిపోయిన వాడకట్లు
భూగర్భ జలాలు లేక
బోసిపోయిన బావులు
ఆదాయం లేని రైతులు
పేరుకుపోయిన అప్పులు
యూరియా కోసం తిప్పలు
పంటలను ముంచెత్తిన వరదలు
పంట పొలాల్లో వెలసిన వెంచర్లు
బతుకుబండికి తప్పని పంచర్లు
పండగ పండక్కే దీపకాంతులు
కానరాని ఆత్మీయ పలకరింపులు
ఉన్న ఊర్లో వలసవాదులం
కన్న ఊర్లో చుట్టపుచూపులం
బీరకాయల తిరుపతి
94923 02057
- Tags
- Poem
Next Story






