- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అతనికి పోటాపోటీగా
గొంతు పెంచటం ఆమెకూ తెలుసు
మాటకు మాట తూటాలా
విసిరే విద్యా ఆమెకు వచ్చు
వ్యంగ్య బాణాలు సూటిగా
గుండె లో గుచ్చగలదు
ఇవన్నీ తెలిసినా ఆమె చేయదు
వితండ వాదనం అనవసర వాదన
అని ఆమెకు తెలుసు
ఏ మాత్రం హేతుబద్ధంగా గాని,
సమతుల్యతతో గాని
మాట్లాడటం తెలియని
ఒక అహంకార రూపంతో
మాటలు పెంచి తనను
తగ్గించుకోవటం కన్న
మౌన ధిక్కారమే
ఆమె ఎంచుకున్న మార్గం!
ఆమె మనసుకు ఆలోచన
అన్నది రానీయకుండా
ప్రతి క్షణం శాసిస్తునే ఉంటాడు
ఆమె మాట్లాడదు
అతని మాట వినదు
అతను చెప్పింది చేయదు
వెతుక్కోగలిగితే ఆమె మౌనం లోనే
అతనికి సమాధానాలు దొరుకుతాయి
మౌనమూ ఒక భాషే!
మౌనమూ ఒక కమ్యూనికేషనే
ఆమె ధిక్కార ప్రకటన మౌనమే!
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem
Next Story






