ఓ కవి

by Ravi |   (  Updated:2025-09-07 23:30:08  IST  )

Poem

ఓ కవి
X

నీ భాష, భావన నిన్ను కవినిచేస్తాయి

మాకు నమ్మకన్ని కలిగిస్తాయి

నీ భాద్యత నిన్ను కవిగా నిలబెడతాయి

మాకు మర్గదర్శకత్వం చేస్తాయి

నీ స్పందనలు, అనుభవాలు

నిన్ను విశేష వ్యక్తిని చేస్తాయి

మాకు మానసిక ఆనందాన్నిస్తాయి

నీ తేటపదాలు, తేనెపలుకులు

నిన్ను ఆకాశానికెత్తుతాయి మాకు

మాటల మర్మాలు తెలుపుతాయి

నీ కలము, కాగితము

నిన్ను కదిలిస్తాయి మాకు బేడీలేస్తాయి

నీ గళము, గానము నిన్ను గాంధర్వుడిని చేస్తాయి

మాకు వీనులవిందునిస్తాయి

నీవే మాకు డశ, దిశ

నీవే మాకు ఆశ, ధ్యాస

నీవే మాకు అందము, ఆనందము

నీవే మాకు ఆశాజ్యోతివి

నీవే మాకు విఙ్ఞానగనివి

నీవే మాకు అక్షరలక్షాధికారివి

-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,

[email protected]

Next Story