సాగనివ్వం!

by Ravi |   (  Updated:2025-08-31 23:00:04  IST  )

Poem

సాగనివ్వం!
X

సాగనివ్వం!

ఈదేశం చాతుర్వర్ణం!

ఎర్రి కమ్మీనిస్టులారా!

మీది సమానత్వం!

ఎప్పటికీ సాధ్యం కాదు!

ముక్కోటి దేవతల్ని

ఇంద్ర వైభోగాల్ని

రంభ ఊర్వశి మేనకల్ని

సప్తరుషుల్ని సృష్టించాం!

చదువుల్లేకుండా చేసి

మేం చెప్పిందే వేదమని

జనానికి నూరిపోసాం!

నరనరానాఎక్కించాం!

మీరు బాగుచెయ్యలేరు

ఇక్కడ సమానత్వంకల్ల!

శూద్ర జాతి వాళ్లలోవాళ్లు

తన్నుకు చావాల్సిందే!

పరలోకం పరమాత్మ

వీళ్ల కైవల్య మార్గం!

ఎంతో కష్టపడి జనాన్ని

పిచ్చిభక్తుల్ని చేసాం!

జనం మామాటే వింటారు

మేమంటేనే ఇష్టం!

ఎక్కడివాళ్ళు అక్కడే!

మేం బ్రహ్మ శిరోద్భవులం!

వేల సంవత్సరాలుగా

అందమైన అబద్ధాలు

చెప్పింది మా సుఖంకోసం!

సమానత్వం కోసంకాదు!

సమానత్వంలేదు

సమసమాజం లేదు

మీ కమ్మీనిష్టు సిద్ధాంతం

ఇక్కడ సాగనివ్వం!

-తమ్మినేని అక్కిరాజు

హైదరాబాద్

Next Story