పూర్వీకుల ఆర్తనాదాలు

by Ravi |   (  Updated:2025-08-31 22:30:28  IST  )

Poem

పూర్వీకుల ఆర్తనాదాలు
X

మృత రాత్రి అంత సులువుగా రాదు

సముద్రమంత బాధలో

మన పడవ ముక్కలైపోయింది

ఎవరూ మౌనంగా వుండొద్దు

మన ఏడుపులు వడ్రంగి పిట్టలా

సుత్తితో జ్ఞాపకాలను మోదుతుంటాయి

ఆకుపచ్చని దుస్తుల్లోని మనుషులారా,

మీరు కళ్లు మూసుకోవడానికి

ప్రయత్నించినప్పుడు...

మీకు వినిపించే

మా పూర్వీకుల ఆర్తనాదాలు

మీ శాంతిని తూట్లు పొడుస్తాయి

స్పానిష్: ఇర్మా పినెడా

తెలుగు: దేశరాజు

99486 80009

Next Story