- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నువ్వు చనిపోయాక అమ్మ
నీ మంచాన్ని కొంచెం జరిపింది.
నీ స్థానాన్ని నేను తీసుకున్నాను.
కర్దేషియన్ రియాలిటీ షో నుంచి
నల్లరంగు ప్రోగ్రాం కి
టీవీ ఛానెల్ మార్చడం కూడా
పెద్ద కష్టమేమీ కాలేదు!
రాత్రి అంతా మీ కుక్క ఒకటి
మొరుగుతూనే ఉంది.
బహుశా అది వేడికి
సర్దుకుంటుందేమో అనుకున్నాం?
మాకు సంతోషం కావాలి
మీకు పూలు కావాలి.
చామంతి విత్తనాలు మొలకెత్తినప్పుడు
గుర్తుందా..నేనేమన్నా
కోల్పోతానని అనుకుంటున్నావా?
అని నువ్వు నన్ను అడిగావు.
నేను వెంటనే "లేదు లేదన్నాను".
ఎందుకంటే వాస్తవాన్ని తిరస్కరించడం
నొప్పిని తగ్గిస్తుంది కదూ?
ఒకసారి నేను నా ప్రియమైన
పింగ్‌పాంగ్ బాల్‌ను పోగొట్టుకున్నాను.
అది సరిగ్గా నీ ఒళ్ళో దొరికింది !
విషాదం ఏమిటంటే మేమెప్పుడూ
మాకు దక్కని వాటినే కోరుకుంటూ ఉంటాము.
కాలేజీ ఫంక్షన్‌లో కూడా
నాకు ఇష్టమైన జుడిత్‌తో
డాన్స్ చేయడానికి
నేను నీలా నటించాను!
విచిత్రం ఏమిటంటే,
ఆ జుడిత్ నన్నెన్నడూ
కన్నెత్తి కూడా చూసి ఎరుగదు!
కానీ చూడు!ఈ రాత్రి మాత్రం
నేను మొదటి వరుసలో నీ పేరే రాస్తాను.
కానీ మిగతా కాగితాన్నంతా
నీ పేరు లేకుండా ఖాళీగా వదిలేస్తాను.
ఎందుకంటే నాలో నిన్ను చూసుకోవడం
ఇక నాకేమాత్రం ఇష్టం లేదు.
ఓహ్ చూడు.. ఎలా రాలిన ఆకులు
అంతటా వెదజల్లబడి, బహుశా
కుళ్లిపోయి కనిపిస్తూ ఉన్నాయి.
నా ఖాళీ కాగితం మీద
నీ పేరు .. ఊహు వద్దు?
(After suicide!-Akpa Arinje సమకాలీన ఆఫ్రికన్ పోయెట్రి సీరీస్ నుంచి)
మూలం: ఆక్పా అరింజె
అనుసృజన - గీతాంజలి
88977 91964
- Tags
- Poem






