స్నేహ గీతం

by Ravi |   (  Updated:2025-08-03 23:00:46  IST  )

Poem

స్నేహ గీతం
X

దారి తప్పితేనో, చేజారితేనో,

మనసుకు నచ్చకపోతేనో కాదు.

మరిచిపోక మనసునిండా నింపుకునేదే...

అది అందరిలోనూ కొలవని ప్రమాణంలా

దాస్తే దాగేదే స్నేహబంధం !

లాలించే అమ్మలోనూ,

బుజ్జగించే నాన్నలోనూ కనబడేది ప్రేమ.

మనసుకు మరో నిదర్శనమైనది,

అది చెక్కని శిలాఫలకమైన స్నేహచిత్రం !

ఆటపాటల్లో జంటగా

ఎప్పుడూ చేజారనీయక,

వెంటుండి భుజాన్ని తడుతూ

గుండెలో దాగుండే మరోబంధమిది !

ఆకలికి ముద్దలా,

ఆపదలో మరోప్రాణంలా,

అవసరాల్ని తెలుసుకుని

కనబడని కంటి చెమ్మలా

కలతల్ని తీర్చే, ఆప్తమిత్రం

మరో రుణబంధం !

ఒకరికొకరుగా చూసేవారికి

దిష్టిచుక్కల కొలమానం లేని కొలతలై,

స్నేహానికి మరో ప్రతిరూపమైన

వారందరికీ... ఇదే

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు !

-అనిత చరణ్

94945 79069

Next Story