- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
"దుక్క" ఎండిపోతున్నది...
"మొలక" మొఖం మాడిపోతున్నది...!
నీరు లేక ... "నారు మడి"
నోరు తెరుచుకుంటున్నది...!!
"కాలం" కన్నెర్రజేసి....
చినుకు రాల్చనంటున్నది ....!
ముందు మురిపించి ...
"వానా" ఇప్పుడు...
ముఖం చాటేస్తున్నది....!!
"పొడి గాలే" వడివడిగా...
వీచుకుంటు వెళ్తున్నది...!
"దూదిపింజలా.." మబ్బు తెప్ప...
నింగిన కదిలిపోతున్నది..!!
ఏపుగ ఎదగాల్సిన "పైరు" ...
" ఎండి" మెండిగ కన్పిస్తున్నది...!
"అన్నదాత" ముఖాన ...
ఇప్పుడు ఆందోళన నెలకొన్నది...!!
కాలం "కరుణ" కొరకు...
"కర్షకలోకం" ఎదురు చూస్తున్నది..!
కరువు తీర వానొస్తే ...
"రైతన్న"కు నిరాశ తీరనున్నది....!!
-బొల్లెద్దు వెంకటరత్నం
99636 16381
- Tags
- Poem
Next Story






