అనిశ్చితి

by Ravi |   (  Updated:2025-03-17 00:30:07  IST  )

Poem

అనిశ్చితి
X

నిశ్చల నీటిలో నిలబడ్డ రాయిలా

కదలని జీవితాన్ని కాలక్షేపిస్తూ

స్తంభించిన గాలిలో ఏమీ పట్టని

ఆలోచనలు కొనసాగని అనిశ్చితంలో

ఎదురుగా ఆకు కదలాడని

అనంతంగా విస్తరించిన చెట్టు

అస్పష్టంగా వేలాడుతున్న

రెక్కలు తెగిన గబ్బిలాలు

ముఖానికి తగులుతున్న

చల్లటి గాలి తెరల వెనుక

కత్తి గాట్లకు కారుతున్న

రక్తపు మరకలు ఎవరివి?

నీకోసమే కట్టుకున్న

చెట్టు తొర్రలోంచి

కళ్లు బయటకు పెట్టి

చుట్టూ ఉన్న లోకాన్ని పరికించు

- బండ్ల మాధవరావు

88976 23332

Next Story