కష్టం

by Ravi |   (  Updated:2025-03-11 00:00:29  IST  )

Poem

కష్టం
X

కష్టాలు మన చుట్టాలు

కడగళ్ళు మన నావలు

కన్నీళ్ళు మనవలు,

మనవరాళ్ళు..

కడలి పొర్లివచ్చే దుఃఖం

దాటడం

చిరునవ్వును

పెదవిపై అతికిస్తే సాధ్యమా

మనసున సంతోష

తరంగాలను

నింపితే సాధ్యమా?

శ్రమని నమ్మిన మనం

కష్టం మన చుట్టమైన

స్నేహబంధాలలో

మరపున పెడితే సాధ్యమా?

- అరుణకమల

96764 43185

Next Story