- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఎన్నో పంచాయితీలను తీర్చిన
ఊరి నడిబొడ్డున
ఉన్న రావిచెట్టు లేదు
రావి చెట్టు కింద పెద్ద మనుషుల
అలికిడి, రావి చెట్టు చుట్టూ
పరచబడిన పలుగురాళ్ళ అరుగూ లేదు
ఒకరికొకరు అనుకున్న తరాన్ని చూసి
ఎవరికి ఎవరనుకునే వారిని చూడలేక
ద్రవ్యం మానవ సంహారం చేస్తుండగా
బోసి పోయిన ఊరును చూడలేక
నేలకొరిగిన రావి చెట్టు
రావి చెట్టు ముందరి
ఊరబావి ఊట ఇంకితే
గతం తాలూకు స్మృతి గానైనా మిగల్చక
నడమంతరపు పాలిథిన్
సంచులతో నింపిన నేటి తరం!
ఊరకుంట అలుగుల్లో
ఎదురీదుతున్న చేప పిల్లలు
జీవిత కాలానికో సందేశం ఇస్తున్నాయి!!
బతుకు పోరులో మనుషుల వలస
ఉనికి పోరులో ఊరు నిత్య సమరం!
- గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201
- Tags
- Poem
Next Story






