వాడొక్కడే ఉంటే ఈ వర్షంలో

by Ravi |   (  Updated:2025-03-10 00:00:26  IST  )

Poem

వాడొక్కడే ఉంటే ఈ వర్షంలో
X

వర్షం వస్తే కదా

ఇసుక మట్టి కొట్టుకుపోయి

స్వచ్ఛమైన నేల కనిపించేది

ముఖం వేసుకున్న అనేక

రంగులు తూడ్చికపోయి

మనిషి అసలు రంగు తేలేది

వర్షం వస్తే బహుశా

కన్నీళ్లు కనిపించకపోవచ్చు

లోపల చేయి చాపి గుండె

నిమిరే తోటమాలి వాడొకడుంటే

వర్షం కూడా నది అలలు

చేసి నడిపిస్తాడు

తడిసి ముద్దయిన సూర్యుని

అన్వేషిస్తూ నడకకు

పాదరసం పూసి పరిగెత్తిస్తాడు

ఇప్పుడు ఈ వర్షంలో వాడొకడుంటే

ఆరేస్తూ వస్త్రాన్ని ఒంటిని

ఆకాశం మీదికి విసిరేస్తాడు

నగ్నచలనంతో

సీతాకోక రెక్కల్ని తొడుక్కొని

మళ్ళీ భూమి నడక ముద్ర అవుతాడు

వాడొకడుంటే ఈ వర్షంలో

జనజ్వాల

99491 63770

Next Story