కన్నీళ్లు

by Ravi |   (  Updated:2025-03-09 23:46:18  IST  )

Poem

కన్నీళ్లు
X

వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు

జంటగా మేమున్నామంటూ చేరువై

చింతలన్నీ చెక్కిలిపై మోస్తుంటాయి

గుండె బరువెక్కినప్పుడు

నొచ్చుకునే మాటలు

చెవులకు చేరినప్పుడు

కలతలన్నీ చెక్కిలిపై మోస్తుంటాయి

భరించలేని రోగాలు, అందుకోలేని

భోగాల నడుమన నలిగిపోతున్నప్పుడు

మౌనంగా చెక్కిలిని ముద్దాడుతుంటాయి

ఆశల తీరంలో విహరిస్తూ...

కర్పూరంలా కాసులన్నీ ఖాళీయైనప్పుడు

దిక్కుతోచని స్థితిలో

చెక్కిలిపై జలపాతాన్ని తలపిస్తాయి

దురాశతో దుర్మార్గపు ఆలోచనలతో

అందిన వజ్రన్ని కాదని

రంగురాయికై ప్రాకులాడి

చివరికి చేజార్చుకున్న

వజ్రం విలువ తెలిసి రోదిస్తున్నప్పుడు

చెక్కిలిపై చెరగని ముద్రవేసుకుంటాయి

వాసి జ్యోత్స్న

98668 43005

Next Story