- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నాకు స్వరం లేదు..
నా స్వరంలో నిశబ్దం దాక్కుంది
అప్పుడప్పుడూ
మెల్ల మెల్లగా నిశబ్దాన్ని బద్దలుకొడుతూ
ఒక్కో పలుకూ వెలువడేది
కొంత ఆర్ద్రంగా కొంత గంభీరంగా
మరికొంత ఆర్తిగా
వెలువడ్డ ప్రతి పలుక్కీ నడుమ
అంతర్లయగానూ అంతర్లీనంగానూ
ఏదో ఒక వణుకు..
మౌనాన్ని మోస్తున్న వణుకు
పలుకేమో చెప్పాలనుకున్న భావాన్ని
వణుకేమో హృదయపు ఆత్మనీ
ప్రతిధ్వనిస్తూనే వున్నాయి..
పలుకులలోని గుసగుస
మౌనంలోని వేదన
నా స్వరంగా రూపాంతరం చెందాయి
ఒక్కో మాటా తడబడుతూ తడితడిగా
వాక్యాలై కవితలై నాట్యం చేసాయి
ఒక్కో కవితా
నాకూ లోకానికీ నడుమ
వారధిలా నిలబడ్డాయి
ఇంకేముంది
నా ‘స్వరం’ నిరంతరంగా మోగుతూనే వుంది
- వారాల ఆనంద్
94405 01281
- Tags
- Poem
Next Story






