- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

స్వతంత్రమై ఎగిరే పతంగిలా
స్వేచ్ఛపై పూర్తి హక్కుతో,
నిట్టూర్పులోని నిజంలా నిలబడతాం !
పిడికిలి మా ధైర్యం
సాహసం మా ఊపిరి
ప్రతిచోట, ప్రతి కదలికలో
ఆత్మస్థైర్యంతోనే అధికారం చెలాయిస్తాం !
మాకు వెలకడితే పిడుగులవుతాం !
ఆ శిఖరం మా ఎత్తు
ఆ హిమం మా మనస్సు
ఆ జ్వాల మా ఆగ్రహం !
ఆనాటి పరదా చాటు బొమ్మలం కాదు.
పంచేంద్రియాలు నిగ్రహంతో నింపుకొని,
సృష్టికే మూల బిందువులం.
అంతటా నిలబడే వనితలం.
నిలబడతాం...
అణచివేత సమాజాన్ని
చూస్తూ కాదు,
మా దారులకు అడ్డుగా ఉన్న చీడల్ని,
వెతికి పహారా కాచే సైనికుల్లా !
నిలబడతాం...
ప్రపంచ మనుగడలను
లెక్కిస్తూ చూస్తున్నాం.
కన్నీటి ఛాయల్ని మూసుకుంటూ కాదు, తెరచుకుంటూ !
నిలబడతాం...
తాదాత్మ్య భావాన్ని పంచుకుంటూ,
ప్రగతి పథానికి ఆరనిజ్యోతిలా !
నిలబడతాం....
ఒక్కో నిశ్శబ్దం అనంతశబ్దాల ధ్వనిలా,
వెలిగే నిత్య జీవన వెలుగులా !
-అనిత చరణ్
94945 79069
- Tags
- Poem






