- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మార్పుకాలం
by Ravi |
X
రోజులెలా మారాయో
మనిషిని చదువు తెలుస్తుంది
కాలం ఏమీ పట్టనితీరు
జరజర జారే చిత్రం
ఎవరో తరిమినట్టు
పేజీలు తిరగేసే బతుకు
రాయని కావ్యంలో గీయని
బొమ్మలు ఎగరేసే భ్రుకుటి
నీలాకాశంలో మోము అస్పష్టం
లేదా పూయని చంద్రోదయం
ఓపిక నడిపించే నమ్మిక సమయం
సంయమన దారిలో రావొచ్చూ
కలవొచ్చు నిన్నూ నన్నూ
ఓటమి కొత్త అర్థం మాయం కాదు
గెలుపు మైదానం పడిలేచే పట్టు పునరుత్థానం
బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళవడం ప్రజాతీర్పు
కట్టెలమ్మిన చోట పూలూ
పూల చోటున కొయ్య కర్రలు అమ్మడం విధిగీత
దేనికీ అతీతుడు కాని బలమైన శక్తి మనిషి
తలవంచడమే కాలంలో ప్రయాణం
డా. టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871
Advertisement
- Tags
- Poem
Next Story