- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
బడిగంట మోగినపుడు
గుండెగంట లబ్ డబ్ అని మోగుతూ
పాదాల్ని వడివడిగా మెలిపెడుతుంది
బడిగంట మోగినపుడు
చదువులగంట తుమ్మెద నాదమై
వినబడుతూ జ్ఞానం విరిసే పూలతోటకు
పదపదమని తొందరపెడుతుంది
బడిగంట మోగినపుడు
పిల్లల నవ్వులగంట కిలకిలనాదమై
నాలో చైతన్యాన్ని రగిలించి నాతో
నాలుగడుగులెక్కువేయిస్తుంది
పొద్దున పూట మోగిన బడిగంట
బడిబాటలో కాళ్లకు సంకెళ్లేసి లాక్కెళితే
సాయంత్రం మోగే బడిగంట
అవే కాళ్లకు సంకెళ్లు విప్పి
స్వేచ్ఛలోకి పరుగుపెట్టిస్తుంది
ఉదయ సాయంత్రాల్లో
బడిగంట మోగినపుడల్లా
పిల్లలకైనా, నాకైనా
బతుకుగంట చెవుల్లో
మార్మోగుతున్నట్టే వుంటుంది
- చిత్తలూరి
91338 32246
- Tags
- Poem
Next Story






