- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కుక్కల అరుపులకు
కూని రాగాలు పలుకునా ...
నక్కల కేకలకు
నరాలు స్పందించునా ...
డప్పుల మోతలకు
నిర్జీవ నదులు కదిలేనా ...
వికృత విన్యాసాలకు
ఎండిన డొక్క ఎగురునా...
జెండాల రెపరెపలు
ఊపిరికి ఊతమగునా....
ఏలడానికొచ్చినోళ్ళు
విసిరేసే జంతికలకు
నీ ఆకలి తీరునా ....
బతుకు జట్కా సాగునా
నీరు తాగి పరుండక
నిజాన్ని బతికించురా ...
నిజం మాటున దాగిన
దగాను గుర్తించురా
బూతు వైపు అడుగు వేసి
తెలివిగ ఓటేయ్యురా !!!
- న్యాలకంటి నారాయణ
95508 33490
- Tags
- poem
Next Story






