రేచీకటి

by Ravi |   (  Updated:2023-10-29 18:45:25  IST  )

Poem

రేచీకటి
X

వెలుతురుంటేనే వీడికి వెలుగు

చీకటి అంటే వీడికి వణుకు

చెప్పుడు బాగానే చెప్తారు

చేసే దగ్గరనే మతలబు ఉంది

ఆత్మ వంచన

పుట్టినరోజు జయంతులు

మళ్లీ మళ్లీ చనిపోతూ

మరణించిన రోజు వర్ధంతులు

సమాధి మీద పూల గుచ్ఛాలు

వంగి వంగి నంగి దండాలు

మహాత్ముడైనా ఒక్కటే

మహనీయుడైన ఒక్కటే

సామాన్యుడి త్యాగమైనా ఒక్కటే

అంతటా దొంగ కొంగజపం

ఓట్ల రాజకీయ టెంపర్ వెంపర్లాట

షరా మామూలే

ప్రస్తుతానికి ఇంతే సంగతులు

చెవి వొగ్గి దేశం చిత్తగించవలెను

-జూకంటి జగన్నాథం

94410 78095

Next Story