కవిత: అనుదినం..... ఆనందంగా

by Disha edit |
కవిత: అనుదినం..... ఆనందంగా
X

మనం ఈ రోజంతా

కొత్తదనంతో- నవతనువుతో

హృదయమంతా ఉదయించిన

ఉత్తేజ ఉద్వేగ భరిత కిరణాలం

మనమంతా

ఉల్లాసంగా ఉత్సాహంగా

తొలి యవ్వన కాంతులమై

అన్ని పండుగలన్నీంటినీ

ఒకేసారి కాళ్ల ముందుకు వచ్చినట్లుగా

ప్రపంచమంతా

విందులు వినోదాలు సరదాలు

సరాగాల సంలీన విలీనమై

ఓ విజయంగా విజృంభిస్తాం

కలకలం-కలతలు లేకుండా

కలకాలం కలిసి ఉండాలనీ

కలలన్నీ నిజం కావాలనీ

సంకల్ప సంక్రాంతికి

నిర్ణయాలు నిర్భయంగా

తోడూ నీడైన నిమిషాన

ప్రతీ వాగ్దానంతో ఒళ్లు విరుచుకుంటాం

ఇక, ఇప్పటి నుండి

రేపటి - భావి జీవితం కోసం

క్రమం తప్పని..కసరత్తుని

కంకణంగా కట్టుకుని

కలం కదిలించి- కదం కదిపి

గళం విప్పి- గతం మరిపించి

సవరించుకుని సరిదిద్దుకుని

సర్దుబాటు చేసుకుని

వైరాగ్యంలో మహాభాగ్యాన్ని

వేకువలోనే వెతుక్కుంటాం

అప్పటి వరకు

ముడుచుకున్న ముఖాలు

వికసితమైన వీక్షణంలో

అనుదినమూ ఆనందంగా

శ్వాసించిన..ఆశించిన..

ఆచరించిన ఆ తరుణంలో

నిన్నటి కన్నా మిన్నగా

ఈ తరం మహాత్తరమవుతుందని

ఆరంభశూరత్వ లేమిని

నిత్యం నిఖిలం అభిలషిస్తాం


కందకట్ల జనార్దన్

గ్రంథపాలకుడు

78936 31456

Also Read...

వారం వారం మంచి పద్యం: ఫలితం


Next Story

Most Viewed