కవిత: భయంతో......అభయం

by Disha edit |
కవిత: భయంతో......అభయం
X

మన మార్గం ఒకటైనపుడు

మనసులు నిచ్చెనమెట్లయి

నిలకడగా ఉన్నపుడు

రణము లేదు...ఋణము లేదు.!

ధైర్యంగా ఉన్నపుడు

భయం గుప్పిట

కంపితులవడమెందుకు?

అక్షర దోషముంటేనే

తక్షణమే దిద్దుకునే

ఆలాపన ఉన్నపుడు

ఏదైనా...ఎపుడైనా...

చివరికి చినికి చినికి గాలివానగా

అంకురించి-అధికమవనపుడు

గొడుగులుండవు-గొడవలుండవు!!

ఈ రోజే తొలిరోజనీ ఆత్మ గౌరవం రవళిస్తున్నపుడు

నయనాలు నిజాయితీ నిలువుటద్దాల్లో

సమంగా-స్వఛ్చతగా- స్వేఛ్చాయుతంగా

విరజాజిలా విప్పారుతున్నపుడు

కరకమలాల కడలి, ముందుకు కదలీ కదలీ

చేరువగా చేరుకుని చేయూతనందిస్తునపుడు

ఒకరికి మరొకరు ఆరు రుతువుల

అరుణోదయమయంతో అరవిందమైన

విలువల వితరణ విత్తనాలుగా

మెల్లిగా మొలకెత్తుతున్నంత సేపూ

రగులుకోవు.. రాగద్వేషాలు

అంటుకోవు..అలుముకోవు..అల్లుకోవు

అంధకార అహంభావాలు!!!

కందకట్ల జనార్దన్

వరంగల్

78936 31456


Also Read...

వారం వారం మంచి పద్యం: మానవీయత


Next Story