కవిత:ఓపిక

by Ravi |   (  Updated:2022-12-26 02:27:31  IST  )

poem

కవిత:ఓపిక
X

స్త్రీ

సహనమూర్తి

కరుణ కిరణ

ప్రభవ జ్వలిత

సురుచిరసుందర

సుమలత

గులాబీ ముళ్లను సైతం

గుండెల్లో దాచుకున్న

గులాబి పువ్వు

మనస్తత్వం

తరుణి తత్త్వం

ఆ ఓపికే!

ఆ స్త్రీ మూర్తికే

వజ్రాయుధం

స్త్రీ మనస్సు

ఎప్పుడు

ఎలా

ఎన్ని మలుపులు తిరుగుతుందో

ఊహించలేం

కారణం ఏదైనా

కానివ్వండి

ఊహించని మలుపుకి

తట్టుకునే శక్తిని

మగవాడు

తనకు తానే

ప్రసాదించుకోవాలి

బెంబేలు

పడకూడదు

ఇది లోకసూత్రం.


కొరుప్రోలు హరనాథ్

9703542598


Also Read...

కవిత: అస్తిత్వం


Next Story