కవిత: అమ్మ హృదయం

by Ravi |   (  Updated:2023-01-29 18:30:52  IST  )

peom

కవిత: అమ్మ హృదయం
X

మోడువారిన అమ్మల హృదయాలను

సస్యశ్యామలంగా మార్చడానికి

అవని పైకి వచ్చిన జలజల పారే గంగోత్రివి..!

కారు చీకట్లో అలమటిస్తున్న అమ్మల జీవితాల్లో

వెలుగు నింపడానికి వచ్చిన నిండు జాబిలివి..!

అమ్మల కన్నీటిని తుడవడానికి

దివి నుండి భువికి దిగివచ్చిన అపర కనకదుర్గవి..!

మబ్బు పట్టిన మానవతను దారిలోకి

తీసుకొచ్చే ఝాన్సీ రుద్రమదేవివి..!

జీవం కోల్పోయి ఆకలితో

అంటుకు పోయిన ఎండిన డొక్కలతో

ఆకలితో అలమటిస్తున్న అమ్మలకు

దివి నుండి భువికి దిగివచ్చిన అన్నపూర్ణ దేవివి..!

(బాలికలకు సరైన వాతావరణం కల్పించుదాం. వారిని బాగా చదువుకోనిద్దాం. ముందుకు వెళ్లేందుకు అన్ని అవరోధాలనూ తొలగిద్దాం.)

మంజుల పత్తిపాటి

93470 42218

Next Story