- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడి విజయం!
ప్రియమైన ప్రజలారా!" "మాకు ఓట్లు వేయండి మేము మీకు మందిరాలు కట్టిస్తాము"!

దేవుడి విజయం!
*
ప్రియమైన ప్రజలారా!" "మాకు ఓట్లు వేయండి మేము మీకు మందిరాలు కట్టిస్తాము"!
ఎన్నికల హోరు లో ఈ నినాదాలు మారుమ్రో గుతూ ఉంటాయి!
దేవుడు గెలవడం చూస్తూ ఉంటాను అలా!
**. ఒక మతానికి చెందిన దేవుళ్ళు! మనుషుల్ని విభజించే దేవుళ్ళు! ఇళ్లల్లో మాత్రమే ఉండిపోయే దేవుళ్ళు! మా ఊరికి రాని దేవుళ్ళు! వీధుల్లో తిరిగే దేవుళ్ళు! ఆకలి ఎరుగని దేవుళ్ళు!
ధరలు పెరుగుతుంటే పట్టించుకోని దేవుళ్ళు! మా బిడ్డల చదువుకి డబ్బులు ఇవ్వని దేవుళ్ళు!
ఈ దేవుళ్ళ కోసం మందిరాల కోసం మేము ఓటు వేయాలా?
*
చూడండి!దైవ దూషణ చేసినందుకు
నాస్తికుడిగా ఉన్నందుకు నన్ను ఇప్పుడు నిందించకండి!
దేవుళ్ళ కోసం కొట్టుకు చస్తున్న చాలామంది రాజకీయ నాయకులను చూస్తూ విసిగిపోయి ఉన్నాను మరి !
ప్రజలతో కాకుండా
గుడి పూజారులతో మాత్రమే మాట్లాడుతున్న వాళ్లని చూస్తున్నాను!
వాళ్లు గుడులని మాత్రమే దర్శిస్తారు కానీ మా పూరి గుడిసెల్లోకి
అడుగు కూడా పెట్టరు
*
వాళ్లు దేవుళ్ల కోసం కొట్లాడుకుంటారు !
"మా దేవుడో ,మీ దేవుడో రండి తేల్చుకుందాం"! అంటూ సవాళ్ళు విసురుకుంటూ, ఒకరినొకరు రెచ్చ గొట్టుకుంటూ ఉంటారు!
ఏమవుతుంది అప్పుడు?
రేపు ఇదొక దేవుడి విజయంగా మారిపోతుంది అంతే!
ఓహ్! ద్రవ్యోల్బణమా,ఆకలి కేకల పస్తులా,బీదరికమా!
ఓహ్!ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావు నువ్వు?
*
- మౌమితా ఆలం ఇంగ్లీష్ కవిత.
తెలుగు అనువాదం గీతాంజలి.






