చదివించి ఏడిపించే అర్రాసు కథలు

by Ravi |   (  Updated:2025-12-14 23:30:19  IST  )

Arraasu Marikonni Kathalu Book Review

చదివించి ఏడిపించే అర్రాసు కథలు
X

మాతృస్వామ్య వ్యవస్థ నుండి ఎప్పుడైతే పితృస్వామ్య వ్యవస్థగా మారిందో అప్పటి నుండే అధికారం, దోపిడీ, స్త్రీ హక్కులని కాలరాయడం ఆమెని బానిస లెక్కన జమ కట్టడం మొదలైంది. ఈ అర్రాసు కథ కూడా మనల్ని ఏడిపిస్తుంది. నేటి ఆధునిక యుగంలో మనమెక్కడా ఉన్నామో మనల్ని ఒకసారి అక్కణ్ణే ఆగి చూసుకొమ్మని చెప్తుంది. గంగకి ఆవల ఉన్న అత్తగారిల్లు గంగకి ఈవల ఉన్న అమ్మగారిల్లు ఎంతదూరమో చెప్పచ్చు. కాని అత్తగారింట్లో ఆడివిల్లా పడే బాధ, కార్చే కన్నీళ్లు గంగని కూడా దాటకుండానే దాచేయబడతాయి.

పైసలు ఎక్కువున్నా డౌటే..

1960 నుండి 1990 వరకు తెలంగాణ పల్లెల్లో కనిపించిన వాతావరణం భూస్వామ్య పెట్టుబడిదారుల దోపిడీ అంతా ఈ కథల్లో కనిపిస్తుంది. తెలంగాణ పల్లెల వాతావరణం గిట్ల ఉంటదని చెప్పడానికి ఒక తార్కాణం ఈ రాజీ కన్నా కథలు. వంద నోటు కథను చూస్తే.. బడి వాతావరణం కింది కులాల బిడ్డల దగ్గర పైసలున్నా అవి ఎక్కువ ఉండొద్దు ఉంటే అవి దొంగతనమ్ చేసినవో దోపిడివో అన్న పేరే! తపాలపూర్ దొరలు గుర్తుకు వస్తారు. అన్నలు అడవిలో ఏం జేత్తారో అనే ప్రశ్న జవాబులు దొరుకుతాయి.

పాలేరుకు జీతం కాదు ముఖ్యం

పానానికి పైసల విలువ కట్టుడు సుతారం కాదు ఇక్కడ.. పాణం ఉండగా ఇజ్జత్ ఇవ్వాలి పనిచేసే వాళ్ళకి, ప్రతీ పాలేరు జీతాన్ని కోరుకోడు కాస్త గౌరవాన్ని కాస్త విశ్రాంతిని కోరుకుంటాడు. యజమాని జీతం ఇచ్చినంత మాత్రాన బానిస కాదు, ఎదురు తిరిగితే ఏ పనివాడైనా పోరాట యోధుడే.

గోదావరి ప్రవాహంతో పోటీ పడే కథలు

ఈ కథల వాతావరణం అంతా గోదావరి లోయ ఆదిలాబాద్ ఆదివాసి గిరిజన మైదాన ప్రాంతాలకి చెందింది. ఇవి అందరి కథలు. అందరి తరుపున ఆదిలాబాద్ తరఫున రాజీ రాసిన కథలు, రాజీ మాత్రమే రాయగలిగే కథలని చెప్పొచ్చు. ఇప్పుడు గోదారి ప్రవాహంతో రాజీ కథలు పోటీ పడి ప్రవహిస్తాయి. ప్రవహించాలని కోరుకుంటున్నాను.!

-నాగేంద్ర బొలిశెట్టి

86868 48647

Next Story