హైదరా “బాధ”

90

భాగ్యనగరి.. నేడు బాధెళ్లబోస్తుంది.
అందాల నగరం అల్లాడిపోతోంది.
వానపడితే చాలు.. సంద్రమైతోంది…
వరదలతో మునిగి.. వణికిపోతుంది…!

నాటి చెరువు నేడు.. ఊరుగా మారింది..
ఉరికే నీళ్లతో ఊరు… యేరయ్యి పారింది…
పడవల్ల పయణాలు.. సాగించమంటుంది.
చారిత్రక ఆ.. రూపు చెరిగిపోతున్నది..!

నీ రాతెట్ల మారునో…ఓ మహా నగరమా..!
మా రాజధాని తల్లీ… నీకిదీ.. శాపమా..!?

-బొల్లెద్దు వెంకట్ రత్నం (బీవీఆర్)