లిక్కర్.. లాక్‌డౌన్‌లోనూ చక్కర్

by  |
లిక్కర్.. లాక్‌డౌన్‌లోనూ చక్కర్
X

దిశ, నిజామాబాద్: దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నది. కానీ, ఆ జిల్లాలో మాత్రం వారు లాక్ డౌన్ ను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు విక్రయాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా వారు చూస్తున్నారు కానీ, తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించి… అంతా అయిపోయినంక ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. అదేమిటో మీరే చూడండి..

ప్రస్తుం సోషల్ మీడియోలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీంతో విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభత్వం 22న జనతా కర్ఫ్యూ విధించింది. ఆ తదుపరి రోజు నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కొనసాగుతున్నది. అయితే.. వారు బాజాప్తాగా లాక్ డౌన్ నిబంధనలను బ్రేక్ చేస్తూ ఇష్టంవచ్చినట్లు మద్యం అమ్ముతున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అదేమిటంటే.. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని కపిల్ వైన్స్ ను రాత్రి సమయంలో తెరిచి ఆటోలో మద్యం తరలిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జిల్లా కేంద్రంలో మద్యం అమ్మకాలు బ్లాక్ లో సాగుతున్నాయని, అది కూడా మద్యం వ్యాపారుల కనుసన్నులలోనే నడుస్తున్నదనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ, ఇంత వరకు అబ్కారీ శాఖ, పోలీస్ శాఖ మాత్రం దానిపై స్పందించిన పాపాన పోలేదు. వారి అండదండలతోనే నిజామాబాద్ లో మద్యం అమ్మకాలు బ్లాక్ లో జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఆ పనిలో బిజీ..

ఈ నెల 21 వరకు అంతటా మద్యం అమ్మకాలు సాధారణంగా సాగాయి. కానీ, లాక్ డౌన్ నాటి నుంచి మద్యం పూర్తిగా రద్దు చేశారు. కానీ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం మద్యం వ్యాపారులు బాజాప్తాగా లాక్ డౌన్ ను ఉల్లంఘించి మద్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న బార్లు, వైన్స్ లలో ఉన్న మద్యాన్ని రాత్రికిరాత్రే బ్లాక్ మార్కేట్ కు తరలిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా మద్యం ధరలు రెండింతలు కావడంతో వ్యాపారులు సిండికేట్ గా మారి మద్యంను బ్లాక్ మార్కేట్ కు తరలించి సొమ్మచేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.

రాత్రికిరాత్రే..

నిజామాబాద్ జిల్లాలో 90 మద్యం దుకాణాలు ఉండగా అందులో 60 దుకాణాలలో ఉన్న మద్యం రాత్రికిరాత్రే మాయమయ్యి బ్లాక్ మార్కేట్ లో తేలింది. జిల్లా కేంద్రంలోని స్టార్ హోటళ్లతో పాటు బార్ లలో మద్యం నిల్వులు సున్నాకు చేరుకున్నాయి. కానీ, లిక్కర్ కింగ్ లు సిండికేట్ గా మారి మద్యం దుకాణాలకు ఉన్న వెనుక భాగం ద్వారా మద్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి, తమ మనుషుల ద్వారానే విక్రయాలు చేస్తున్నారు. ఐఎంఎల్ డిపోల ద్వారా మార్చి మాసం కోసం తెచ్చిన మద్యం నిలువలు రాత్రికిరాత్రే మాయం చేసేశారు. తమ వద్ధ పనిచేసే వారితో మద్యంను డబుల్ రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు. రోడ్లకు మాత్రం డోర్లు, షట్టర్లు ఉండి మద్యం సిండికేట్ తో మిలాఖాత్ కానివారు మినహా మిగిలిన వారు మద్యం అమ్మకాలు ఎలా చేయ్యాలో, ఎలా మద్యాన్ని రాత్రికి రాత్రితరలించే కిటుకు తెలియక ఊరుకుండిపోయారు. మిగిలిన కోందరు వ్యాపారులు వారి మద్యం తీసుకుపోవడానికి ఎలా అనుమతి ఇచ్చారు మా మద్యం అమ్ముకోవొద్దా అంటూ దబాయించుకుని మరీ బ్లాక్ లో మద్యం తరిలించారు. అయితే, ప్రస్తుతం నగరంలో మంచినీళ్లు దొరకడంలేదు. కానీ, నగరంలోని ప్రతి డివిజన్ లో బెల్ట్ షాపుల మాదిరిగా మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.

వెల్లువెత్తుతున్న విమర్శలు

గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు గ్రామాల కట్టడిల మధ్య జోరుగా సాగుతున్నాయి. గ్రామాలలోకి ఇతరులను అనుమతించకుండా శివారులలో అడ్డుకోవడంతో గ్రామాలలో మద్యం అమ్మకాలను అడ్డుకునే వారులేరు. అయితే, వైన్స్ లు, బార్ ల నుంచి బాజాప్తాగా మద్యం తరలించినప్పటికీ ఇటు పోలీసులు గానీ, అబ్కారీ శాఖ అధికారులు గానీ వారిపై ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విడ్ఢూరంగా ఉంది

ఒక బీరు బాటిల్ ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో రూ. 300 దాటింది. ఇక మద్యం బాటిల్ కు అయితే 50 శాతం, విస్కీ, బ్రాందీ వంటి ఇతర వైన్ ల ధరలు రెండింతలు చేసి విక్రయిస్తున్నారు. ఇగ విదేశీ మద్యం, బ్రాండెడ్ మద్యం బాటిళ్ల ధరలైతే చెప్పనక్కర్లేదు.. అవి ఏకంగా ఆకాశాన్నంటుతున్నాయి. హోల్ సెల్ కంపెనీల ప్రతినిధులు అడిగితే ఇప్పుడు నో స్టాక్ అని చెబుతున్నారు. ఇదంతా కూడా బ్లాక్ మార్కెట్ మాయగా అభివర్ణిస్తున్నారు. అయితే… అబ్కారీ శాఖ మాత్రం చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ప్రస్తుతం ఖాళీ ఐనా మద్యం దుకాణాలకు సీల్ లు వేసే పనిలో పడటం విడ్ఢూరంగా ఉంది.

Tags : Alcohol, Police, Nizamabad, Black Market, Syndicate



Next Story