మనుషుల్లో హార్ట్‌ రేట్ తగ్గినా ప్రమాదం లేదు.. కానీ ఎప్పుడు, ఎవరిలో అంటే..

by Dishafeatures2 |
మనుషుల్లో హార్ట్‌ రేట్ తగ్గినా ప్రమాదం లేదు.. కానీ ఎప్పుడు, ఎవరిలో అంటే..
X

దిశ, ఫీచర్స్ : గుండె గుప్పెడంతనే ఉంటుంది. కానీ మానవ శరీరంలోని అత్యంత కీలకమైన అవయం. ఎందుకంటే ఇది బాడీలోని ప్రతీ భాగానికి, ప్రతీ అవయవానికి రక్తం, ఆక్సిజన్ సరఫరా కావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే గుండె నార్మల్‌గా పనిచేయడం తగ్గిపోతుందో అప్పుడు రిస్కులో పడతారు. ప్రాణహాని సంభవిస్తుంది. ముఖ్యంగా హృదయ స్పందన రేటు మరీ ఎక్కువైనా, చాలా తక్కువైనా మరణం సంభవిస్తుందని చెప్తుంటారు. కానీ ఒక్క క్రీడాకారుల విషయంలో మాత్రం రెస్టులో ఉన్నప్పుడు హృదయం స్పందన రేట్ తగ్గినా ప్రమాదం ఉండదని నిపుణులు చెప్తున్నారు. దీనినే వైద్య పరిభాషలో అథ్లెటిక్ హార్ట్ సిండ్రోమ్‌గా పేర్కొంటున్నారు. పూర్తి వివరాలేంటో చూద్దాం.

హెల్త్‌లైన్ ప్రకారం అథ్లెట్ల ఫిజికల్ యాక్టివిటీస్ సాధారణంగా మిగతా వారికంటే భిన్నంగా ఉంటాయి. డైలీ పరుగెత్తడం, వ్యాయామం చేయడం ప్రత్యేక ప్రణాళికతో చేస్తుంటారు. అయితే ఈ సందర్భంలో వారి గుండె పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణ వ్యక్తుల గుండె ఒక నిమిషానికి కొట్టుకునే వేగంతో పోల్చినప్పుడు అథ్లెట్ల గుండె అందులో సగం స్పీడునే కలిగి ఉంటుంది. వాస్తవానికి హార్ట్ రేట్‌ను బీట్స్(BPM)లో కొలుస్తారు. ఆయా యాక్టివిటీస్‌లో కూడా కొలుస్తారు. సాధారణంగా రెస్టు తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి హృదయ స్పందన యావరేజ్‌గా 60 నుంచి 80 బీపీఎం మధ్య ఉంటుంది. కానీ పలువురు అథ్లెట్లలో ఎక్కువమందికి ఇది 30 నుంచి 40 bpm వరకు ఉంటుంది. అయినా ఎటువంటి రిస్కు ఉండదు.

ఎందుకు తగ్గుతుంది?

నిరంతరం ఫామ్‌లో ఉండే క్రీడాకారులు లేదా అథ్లెట్స్ హార్ట్ రేట్ తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్సర్‌సైజ్ చేయడం అనేది గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకున్న ప్రతి సందర్భంలో ఎక్కువ రక్తం పంప్ అవుతుంది. దీంతోపాటు శరీరానికి, గుండె కండరాలకు అవసరమైనంత మేరకు ఆక్సిజన్ సప్లయ్ అవుతుంది. ఈ సందర్భంలో గుండె తక్కువగా కొట్టుకున్నప్పటికీ, వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రం హార్ట్ రేట్180 bpm నుంచి 200 bpm వరకు ఉంటుంది. అయితే ఇది మాత్రమే ఫిక్స్ అని చెప్పలేం. కాస్త అటూ ఇటూ అథ్లెట్లలో హృదయ స్పందన రేటు భిన్నంగా ఉండే చాన్స్ ఉంటుంది. ఏజ్, ఫిట్‌నెస్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎయిర్ టెంపరేచర్, ఎమోషనల్ సిచ్యువేషన్స్, స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి కూడా హార్ట్ రేట్‌ను ప్రభావితం చేస్తాయి.

అథ్లెటిక్ హార్ట్ సిండ్రోమ్

క్రీడాకారుల్లో హార్ట్‌రేట్ తక్కువ ఉండటం, అయినా ఎటువంటి రిస్కు లేకపోవడాన్ని నిపుణులు అథ్లెటిక్ హార్ట్ సిడ్రోమ్‌గా పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇది గుండె యొక్క స్థితి. డైలీ ఒక గంటకంటే ఎక్కువగా వర్కవుట్స్ చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రెస్టులో ఉన్నప్పుడు హార్ట్‌రేట్ 35 నుంచి 50 bpm కలిగి ఉండే అథ్లెట్స్ అరిథ్మియా లేదా ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్‌ను కలిగి డెవలప్ చేయవచ్చు. ఇది ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ)లో అసాధారణంగా, ప్రమాద సూచికగా కనిపించవచ్చు. కానీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే దీనివల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదు. అయితే ఇది అథ్లెట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వీరిలో కూడా ఛాతీ నొప్పి, వర్కవుట్స్‌లో మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అవి అథ్లెటిక్ హార్ట్ సిండ్రోమ్ కావు, ఇవి గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Next Story