- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ కార్యాలయంలో పిడుగు.. పరుగులు తీసిన సిబ్బంది
<p>దిశ, కొడంగల్: ప్రభుత్వ కార్యాలయంలో పిడుగు పడటంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొర్మాస్ పేట్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పోలీస్ స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. వెంటనే స్టేషన్‌లోని వైర్లెస్ సెట్ కాలిపోవడంతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బందికి కొందరికి షాక్ వచ్చింది. దీంతో భయాందోళన […]</p>

X
దిశ, కొడంగల్: ప్రభుత్వ కార్యాలయంలో పిడుగు పడటంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొర్మాస్ పేట్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పోలీస్ స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. వెంటనే స్టేషన్‌లోని వైర్లెస్ సెట్ కాలిపోవడంతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బందికి కొందరికి షాక్ వచ్చింది. దీంతో భయాందోళన చెందిన పోలీసులు, స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






