పార్టీలో ‘లైగర్’ టీమ్ చిల్ అవుట్.. కియారాకు అక్కడేం పని?

by  |
పార్టీలో ‘లైగర్’ టీమ్ చిల్ అవుట్.. కియారాకు అక్కడేం పని?
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ ‘లైగర్’. పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కరణ్ జోహార్, చార్మి నిర్మిస్తుండగా.. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా వీకెండ్ కావడంతో విజయ్, చార్మి, పూరి.. కరణ్‌తో కలిసి తన ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన గ్రాండ్ పార్టీకి హాజరయ్యారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, సారా అలీఖాన్, పరిణీతి చోప్రా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ పార్టీకి అటెండ్ కాగా.. మనీష్ మల్హోత్రా ఇల్లు పార్టీ హాట్‌స్పాట్‌గా మారింది. కాగా ఈ ఫొటోలను మనీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Next Story

Most Viewed