‘లైగర్’ రిలీజ్‌.. స్పెషల్ ప్లాన్స్‌లో చార్మి, అనన్య

by  |
‘లైగర్’ రిలీజ్‌.. స్పెషల్ ప్లాన్స్‌లో చార్మి, అనన్య
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ క్యాప్షన్‌తో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను చార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. ఫిబ్రవరి 11న రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌కు అభిమానులు పాలాభిషేకాలు చేయగా.. సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసినంత ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీంతో ‘లైగర్’ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా కొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు నిర్మాత చార్మి, హీరోయిన్ అనన్య రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ గురించి వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. గురువారం ఉ. 8.14 గంటలకు ‘లైగర్’ విడుదల తేదీని ప్రకటించేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు చెప్పారు. జులై 23న ‘లైగర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుండగా.. ఇది ఎంత వరకు నిజమో మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది.

Next Story

Most Viewed