- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదే ట్రెండ్.. లగ్జరీ బ్రాండ్స్‌కు బదులు సాదా దుస్తులను ఎంచుకుంటున్న యూత్
జెన్-జీ తరం కొత్త ఫ్యాషన్ ధోరణిని అవలంబిస్తోంది. భారీ లోగోలు, లగ్జరీ బ్రాండ్లకు దూరంగా ఉంటోంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని ఏ మాల్‌కి వెళ్లినా ఇప్పుడు ఈ తేడా కనిపిస్తుంది.

దిశ, ఫీచర్స్: జెన్-జీ తరం కొత్త ఫ్యాషన్ ధోరణిని అవలంబిస్తోంది. భారీ లోగోలు, లగ్జరీ బ్రాండ్లకు దూరంగా ఉంటోంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని ఏ మాల్‌కి వెళ్లినా ఇప్పుడు ఈ తేడా కనిపిస్తుంది. గతంలో లగ్జరీ బ్రాండ్లు ఆశించినట్లు జెన్-జీ ఆశించడం లేదు. పెద్ద పెద్ద లోగోలు కనిపించే హ్యాండ్‌బ్యాగ్స్, స్నీకర్స్ తగ్గిపోయాయి. వాటికి బదులుగా సాదా లినెన్ దుస్తులు, థ్రిఫ్టెడ్ డెనిమ్, లోగో లేని సింపుల్ అవుట్ ఫిట్స్ ఎక్కువగా కొంటున్నారు.
ఎందుకలా?
ఇది వరకు పెద్ద లోగోలు ధరించడం ద్వారా సామాజిక గుర్తింపును పొందడం సాధారణమైంది. గూచీ బెల్ట్, లూయి విట్టన్ బ్యాగ్ వంటివి కేవలం ఫ్యాషన్‌గానే కాక.. ‘సక్సెస్‌ఫుల్’కు సంకేతంగా మారింది. కానీ జెన్-జీ తరం దీనిని తిరస్కరిస్తోంది. ఈ తరం ఆన్‌లైన్‌లో పెరిగింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎంతో ఉత్సాహం చూపించి తర్వాత వాటిని వదిలేసిన సంఘటనలు ఎన్నో చూశారు. దీంతో వారు బ్రాండ్ల పైన అపనమ్మకం పెంచుకున్నారు. అంతేకాదు ఒకే ఫ్యాక్టరీలో తయారైన సాదా హుడీకి లోగో పెట్టి ఎక్కువ ధర వేస్తున్నారని వారికి తెలుసు. బ్రాండ్ పేరు కోసం అదనపు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేదని చెప్తున్నారు.
వింటేజ్ లుక్..
లేటెస్ట్ డ్రాప్స్ వెంబడించడం కంటే జెన్-జీ సెకండ్ హ్యాండ్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతోంది. థ్రిఫ్ట్ స్టోర్లు, ఆన్‌లైన్ రీసేల్ యాప్స్, ఫ్లీ మార్కెట్లు, పాత ఇంటి అలమారులు వారి స్టయిల్‌కు కొత్త ఆస్తులయ్యాయి. డిజైనర్ దుస్తులు కొన్నప్పుడు కూడా లోగో కాదు ఫాబ్రిక్ నాణ్యత, కట్ వారిని ఆకర్షిస్తాయి. పాత లెవీస్ జాకెట్ లేదా ఫేడెడ్ టీ-షర్టు స్టేటస్ చూపించడానికి కాదు దానికి ఉన్న క్యారెక్టర్ కోసం ధరిస్తారు. అమ్మమ్మ నుంచి వచ్చిన పాత పట్టు చీర లేదా ఎన్నో సంవత్సరాలు ఉపయోగించిన జీన్స్ వారికి ఎక్కువ వ్యక్తిగత అనుబంధాన్ని ఇస్తాయి. కొత్తదనం కంటే వింటేజ్ లుక్‌తో అనుబంధానికి ప్రయారిటీ ఇస్తున్నారు.
పర్యావరణ స్పృహ..
‘క్విట్ లగ్జరీ2 ఈ ధోరణికి బాగా సరిపోతుంది. పెద్ద లోగోలు లేకుండా మంచి ఫాబ్రిక్, సరైన కట్, సాదా డిజైన్ ఉన్న దుస్తులు ధరించడం ద్వారా తమ ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఏదీ చెప్పకుండానే అందరూ గుర్తించేలా ఉండాలనేది వారి శైలి. పర్యావరణ హాని కూడా ఈ మార్పుకు ప్రధాన కారణం. లోగో హెవీ, ట్రెండ్ ఫాలోయింగ్ ఫ్యాషన్ వేగంగా మారిపోతుంది. దాని వల్ల చాలా దుస్తులు త్వరగా వదిలేస్తారు. సాదా, నాణ్యమైన దుస్తులు మాత్రం సంవత్సరాలు ఉపయోగపడతాయి. రీసేల్ చేయవచ్చు లేదా తర్వాతి తరానికి అందించవచ్చు. తక్కువ దుస్తులు కొని నాణ్యమైనవి కొనడం వారి కొత్త ఫ్యాషన్ ఫిలాసఫీ.
భవిష్యత్ ఎలా?
లగ్జరీ బ్రాండ్లు ఈ మార్పును గమనిస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు పెద్ద లోగోలను తగ్గించి మెటీరియల్ నాణ్యత, క్రాఫ్ట్‌మాన్‌షిప్ మీద దృష్టి పెడుతున్నాయి. జెన్-జీ సందేశం స్పష్టంగా ఉంది. మంచిగా అనిపించే ఎక్కువ కాలం నిలిచే తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కేవలం బ్రాండ్ పేరు ప్రచారం కోసం అదనపు ధర చెల్లించడానికి సిద్ధంగా లేరు. లోగోలు పూర్తిగా అదృశ్యం కావడం లేదు. కానీ ఫ్యాషన్‌పై వాటి పట్టు తగ్గుతోంది. ఇది ఫ్యాషన్ పరిశ్రమకు మంచి మార్పే కావచ్చు. జెన్ జీ ఫ్యాషన్‌ను స్టేటస్ సింబల్‌గా కాకుండా స్వీయ వ్యక్తీకరణగా చూస్తోంది.






