కొత్త టెక్నాలజీకి పాత హంగులు.. టెక్ బ్రో ట్రెండ్ తిరిగొచ్చిందోచ్!

by Javid Pasha |

ఫోన్, ల్యాప్ టాప్, డెస్క్‌టాప్ వంటివి మినిమల్ డిజైన్‌తో ఉండటాన్ని జెన్‌జీలు అంతగా ఇష్టపడట్లేదు!

కొత్త టెక్నాలజీకి పాత హంగులు.. టెక్ బ్రో ట్రెండ్ తిరిగొచ్చిందోచ్!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే యువత ధరించే దుస్తుల్లో, వాడే టెక్నాలజీలో డైనమిక్ లుక్స్ ఇష్టపడుతుంది. దీనినే టెక్ బ్రో ట్రెండ్ అని కూడా పిలుస్తారు. కానీ ఇటీవల ఇందుకు భిన్నంగా మరో కొత్త ట్రెండ్ ముందుకు వచ్చింది. ఒకప్పటిలా నలుపు లేదా గ్రే రంగుల్లో సింపుల్‌గా, హుందాగా ఉండే కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను, ఫోన్లను జెన్‌జీలు అంగీకరించడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ముందుంటున్నారు. తమకు నచ్చిన స్టైల్‌ను అనుసరించడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే టెక్ బ్రో డివైజ్‌లను మళ్లీ ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు.

అమ్మాయిలే ఎక్కువ..

ఇప్పుడు తమ ఫోన్ లేదా ట్యాప్‌టాప్, డెస్క్‌టాప్ సింపుల్‌గా, మినిమల్ డిజైన్‌తో ఉండటాన్ని అంతగా ఇష్టపడట్లేదు జెన్‌జీలు, ముఖ్యంగా అమ్మాయిలు. ఇలా ఉంటే.. ఫన్ లేదు. ఫ్యాషన్ లేదు అనేస్తున్నారు. అందుకే ప్లెయిన్ బ్లాక్ మ్యాక్‌బుక్, సాదా ఐఫోన్ కేస్, గ్రే ట్యాప్‌టాప్ వంటి వాటిని కొత్త హంగులతో తీర్చి దిద్దుకుంటున్నారు. అందుకే పింక్ ఐపాడ్స్, హై సాచురేషన్ గేమ్స్‌తో పెరిగిన ఆధునిక యువత తాము వాడే టెక్నాలజీని సైతం మరింత Do It Yourself‌, ఫన్, ఎక్స్‌ప్రెసివ్‌గా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబర్‌డెక్ (Cyberdeck) అనే కస్టమ్-బిల్ట్ పోర్టబుల్ కంప్యూటర్లు పాపులర్ అవుతున్నాయి. ఇవి యూజర్ ఇంట్రెస్ట్, వర్క్‌ఫ్లో, ఇమాజినేషన్ ప్రకారం రూపొందించబడుతున్నాయి. ఇటీవల యువతులు ఈ ట్రెండ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

సొంత ఆసక్తులకు అనుగుణంగా..

టెక్నాలజీని సైతం సొంత ఆసక్తులకు అనుగుణంగా కళగా, ఫ్యాషన్‌గా, సెల్ఫ్- ఎక్స్‌ప్రెషన్‌గా మార్చేస్తోంతి ఈతరం యువత. అందుకోసం సైబర్‌డెక్‌లు టెక్ వేస్ట్‌ను రీయూజ్ చేసి, హ్యాండ్‌క్రాఫ్టెడ్‌గానూ అసెంబుల్ చేస్తున్నారు. ఇవి ప్యూంక్, రెబెలియస్ స్టైల్‌ను ప్రతిబింబిస్తాయి. వీటిని ఆఫ్‌గ్రిడ్‌గా (ఇంటర్నెట్ లేకుండా కూడా) కూడా ఉపయోగించవచ్చు. అంటే యువత ఇప్పుడు వింటేజ్ టెక్నాలజీని సరికొత్త రూపంలో వాడేందుకు ఇష్టపడుతోంది. 5th జనరేషన్ ఐపాడ్‌లు, డబ్బా ఫోన్‌లు, సింగిల్-పర్పస్ డివైజ్‌ల వాడటం కూడా పెరుగుతోంది. ఎందుకిలా అంటే.. టెక్నాలజీని మళ్లీ ఆనందదాయకంగా, స్ట్రెస్‌లెస్‌గా ఉపయోగించుకోవాలన్నదే అసలు ఉద్దేశం అంటున్నారు నిపుణులు. అందుకోసం మినిమలిజం, సర్వైలెన్స్ నుంచి దూరంగా, వ్యక్తిగత స్టైల్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే ట్రెండ్‌గా ఇది మారుతోంది. ఈ మూవ్‌మెంట్ టెక్నాలజీని కేవలం టూల్‌గా కాకుండా, కళ, హాబీ, సెల్ఫ్-ఎక్స్‌ప్రెషన్‌గా మారుస్తోంది. అంటే టెక్నాలజీ ఇక బోరింగ్ గాడ్జెట్ కాదు. యువత సృజనాత్మకతను చూపించే ఫన్ ఎలిమెంట్ కూడా!

Next Story