- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Social media : అదే కావాలి.. సోషల్ మీడియాను వదల్లేకపోతున్న యూత్.. కారణం ఇదే..
Social media : అదే కావాలి.. సోషల్ మీడియాను వదల్లేకపోతున్న యూత్.. కారణం ఇదే..

దిశ, ఫీచర్స్ : ఇంట్లో ఎవరూ లేకపోతేనో.. నలుగురితో కలిసి బయటకు వెళ్లకపోతేనో బోర్ కొట్టే రోజులు కావివి. ఒంటరిగా ఉన్నా హ్యాపీగా గడిపేయొచ్చు అంటోంది నేటి యువత. కారణం సోషల్ మీడియా.. ఏ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఎక్స్‌లోనో మునిగిపోతే ప్రపంచమే తెలియదు. స్ర్కోల్ చేస్తూ.. రీల్స్ చూస్తూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు యువతీ యువకులు. ఎక్కువ సేపు చూడొద్దని పెద్దలు మొత్తుకున్నా ఏదో ఒకసాకుతో ఇన్‌స్టా స్క్రోల్ చేయని వారు, ఫేస్ బుక్ చూడని వారు, వాట్సాప్‌లో చాట్ చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకలా? అదంతే.. సోషల్ మీడియా హవా నడుస్తున్న కాలమిది. కాలంతోపాటు పరిస్థితులు మారుతాయ్. ప్రభావితం చేస్తాయ్. మనుషులు మారుతారు. మనసులూ మారుతాయ్.. మనమూ మరాల్సిందే లేకపోతే.. పరుగు పందెంలో గమ్యం చేరడం కష్టం గురూ..!
టెక్నాలజీ తెచ్చిన మార్పు
ఎవరు అవునన్నా.. కాదున్నా.. కళ్లకు కట్టే వాస్తవం అదే..! టెక్నాలజీ అందరి జీవితాలనూ మార్చేస్తోంది. అందుకనుగుణంగా మనుషులు మారుతున్నారు. అభిప్రాయాలు, ఆలోచనలు, అభిరుచులు సైతం మారుతున్నాయి. అవకాశాలు సైతం తలుపు తడుతున్నాయి. అందుకే కొన్ని విషయాల్లో మనం మారాల్సిందే.. మారి తీరాల్సిందే బ్రో అంటున్నారు నిపుణులు. పరిస్థితి అట్లనే ఉంది మరి. ఒకపూట తినకుండానైనా ఉంటున్నారు గానీ.. ఈ రోజుల్లో ఇన్‌స్టా, ఫేస్‌బుక్ , ఎక్స్ వంటివి చూడకుండా ఎవరైనా ఉంటున్నారా? మీరే చెప్పండి!!
అధ్యయనాలూ అదే చెబుతున్నాయ్
ఇంతకీ యూత్ సోషల్ మీడియాకు ఎందుకంత అడిక్ట్ అయిపోపోతోంది అంటారా? అందులో ఏదో ఉంటేనే కదా.. అంటున్నారు కార్నెల్ యూనివ్సిటీకి చెందిన పరిశోధకులు సైతం 14 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సుగల 16,888 మంది యువకులను పరిశోధకులు సోషల్ మీడియాను ఎందుకు ఉపయోగిస్తారని ప్రశ్నించారు. 2020 నుంచి ఈ ఈ విధమైన అధ్యయనాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వారు ఆన్ లైన్‌లో లేదా సోషల్ మీడియాలో గడపడాన్ని యువత ఒక అలవాటుగా మార్చుకుంటున్నట్లు గుర్తించారు. చాలా మంది తమ జీవితంలో అదో భాగంగా భావిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ పరంగా సోషల్ మీడియా తమను మోటివేట్ చేస్తుందని నమ్ముతున్నారు. అందుకే సోషల్ మీడియాకు యువత అట్రాక్ట్ అవుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
ఒత్తిడి తగ్గిస్తుంది
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో మంచీ చెడూ ఉంటాయి. ఇక నెగెటివ్ అంశాలు కొన్ని పక్కన పెడితే అందులోని కంటెంట్, రీల్స్, రకరకాల సమాచారం తమకు స్ట్రెస్ రెలీఫ్‌గా ఉంటోందని యువతీ యువకులు భావిస్తున్నారని పరిశోధకులు గ్రహించారు. అందులోని ప్రతీ సమాచారం నమ్మదగినది కానప్పటికీ ఏదో ఒక అవగాహనకు, మానసిక ఆనందానికి కారణం అవుతోందని చాలామంది భావిస్తున్నారు. అందుకే యూత్ తెగ ఫాలో అయిపోతోందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి పెరుగుతుంది కూడా..
ఒక విధంగా స్ట్రెస్ రిలీఫ్ అందిస్తున్న సోషల్ మీడియా దానిని వినియోగించుకునే తీరును బట్టి కొన్నిసార్లు అధిక ఒత్తిడికి కూడా కారణం అవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా టీనేజర్స్ అందులోని సమాచారం నమ్మదగినదని భావిస్తే వారు మరింత ఎనర్జిటిక్‌గా ఫీలవుతారని, నమ్మకం లేనిదిగా అనపించినప్పుడు వారిలో రకరకాల సందేహాలు తలెత్తడంతో మానసిక ఒత్తిడికి గురవుతారని ప్రధాన పరిశోధకుడు అడమ్ హాఫ్మన్ పేర్కొన్నాడు.
మెంటల్ హెల్త్ ప్రభావం?
సోషల్ మీడియా - మెంటల్ హెల్త్‌పై దాని ప్రభావం గురించి గత అధ్యయనాలు సైతం మంచి - చెడు ప్రభావాలు ఉంటాయనే మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. మరి కొన్ని అధ్యయనాలు సొంత ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడానికి, సమాజం గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా సహాయపడుతుందని పేర్కొన్నాయి. ఇంకొన్ని అధ్యయనాలు పిల్లలు, టీనేజర్లు ఇతరుల ద్వారా బెదిరింపులు ఎదుర్కోవడం, ఆత్మ న్యూనతా భావానికి గురవడంలో సోషల్ మీడియా ప్రభావం చూపిందని వెల్లడించాయి. కాగా రీసెంట్ స్టడీ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా యువత మంచీ చెడూ ఉందని చెబుతూనే సోషల్ మీడియా యువతను ఎక్కువగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కువగా ఆకట్టుకుంటున్నందున యువత దానిని వదులుకోలేకపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు.






