- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుద్ధుడి విగ్రహాల్లో తలపై ఉండేవి వెంట్రుకలు కాదు.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బౌద్ధ మతాన్ని స్థాపించి, మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించిన గౌతమ బుద్ధుని (Gautama Buddha) గురించి తెలియని వారుండరు.

దిశ, వెబ్ డెస్క్: బౌద్ధ మతాన్ని స్థాపించి, మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించిన గౌతమ బుద్ధుని (Gautama Buddha) గురించి తెలియని వారుండరు. ఆయన అసలు పేరు సిద్ధార్థుడు. క్రీస్తు పూర్వం 5వ, 6వ శతాబ్దంలో శాక్య క్షత్రియ కుటుంబంలో లుంబినీలో (ప్రస్తుత నేపాల్) జన్మించాడు. బుద్ధుని తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు. సకాల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. ఇక గౌతమ బుద్ధునికి 15 ఏళ్ల వయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరికిఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు.
అయితే, బుద్ధుడు తన 29వ ఏటా తన కుటుంబాన్ని, రాజ్యాన్ని సకల సౌకర్యాలను వదిలేసి సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. అయితే, 35 ఏళ్ల వయసులో ప్రస్తుత బీహార్‌లోని బుద్ధ గయలో భోది చెట్టు కింద జ్ఞానోదయం పొందాడని చరిత్ర చెబుతోంది. అయితే, సన్యాస జీవితంలో బుద్ధుడు తలపై ఉన్న జుట్టును మొత్తం తీసేశాడని అంటారు. మరీ, బుద్ధుని ఫొటోల్లో, విగ్రహాల్లో తలపై కనిపించే రింగుల జుట్టు సంగతి ఏంటని అనుకుంటున్నారా?. నిజానికి బుద్ధుని తలపై ఉన్నది వెంట్రుకలు కాదు. ఆయన తలపై 108 చనిపోయిన నత్తలు ఉంటాయి. దీని వెనుక ఒక రహస్యం దాగుంది.
ఓ రోజు గౌతమ బుద్ధుడు మధ్యాహ్నం సమయంలో చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు. ధ్యానంలో మునిగిపోయి ఆయనకు సమయం తెలియలేదు. సమయం గడుస్తున్న కొద్ది ఎండ ఆయన నడినెత్తిపైకి వచ్చింది. ఆ సమయంలో అటువైపు వెళుతున్న ఓ నత్త (Snail) బుద్ధుడిని చూసింది. తీవ్రమైన ఎండలో ఆయన కూర్చోవడాన్ని గమనించింది. సూర్య కిరణాల వల్ల ఆయన ఏకాగ్రత దెబ్బ తింటుందోమోనని ఆలోచించి.. ఆ నత్త మెల్లగా ప్రాకుతూ బుద్ధుని తలపైకి వెళ్తుంది. నత్త కింది చర్మం చల్లగా ఉంటుంది. దాన్ని మరిన్ని నత్తలు అనుసరించాయి. అవన్నీ బుద్దుడి తలపై చేరి ఆయనకు చల్లదనాన్ని కలిగించి ధ్యానానికి భంగం కలుగకుండా చేశాయి.
అయితే, గంటల పాటు ఆ నత్తలు అలాగే బుద్ధుడి తలపైనే ఉండటంతో సూర్య కిరణాల వేడి తట్టుకోలేక చనిపోయాయి. ధ్యానం ముగించుకున్నాక బుద్ధుడు విషయాన్ని గుర్తించాడు. తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని అనుకున్నాడు. బుద్ధుడి కోసం ప్రాణాలు అర్పించిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు. అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్దుడి విగ్రహాలను, ఫొటోలను, చిత్రాలను తయారు చేస్తారు.






