- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1960 RATES: 1960లో వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే.. అప్పట్లో పెట్రోల్ అంత చీపా?
వెస్పా స్కూటర్ ( vespa scooter ) అప్పటిలో ఎంత తక్కువకి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో ధరలు ( Rates ) ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అన్ని వేళలా వస్తువుల వస్తువుల ధరలు ఒకేలా ఉండవు. ఒక రోజు తగ్గినా.. మరొక రోజు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే ఏది కొందామన్నా కూడా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పూర్వకాలంలో కొన్ని రూపాయలు పెడితే బంగారం వచ్చేది. పెట్రోల్ ధర కూడా చాలా తక్కువకే ఉండేది. కానీ, ఇప్పుడు అలా లేదు. ప్రపంచంలో జనాభా పెరిగే కొద్దీ వారి అవసరాలకు అనుగుణంగా అన్ని కల్పించడానికి, వస్తువులు తయారు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. అందుకే , వస్తువుల ధరలు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండవు. అయితే, ఇక 1960 లో వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం ..
వెస్పా స్కూటర్ ( vespa scooter అప్పటిలో ఎంత తక్కువకి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1961 కాలం నాటి బిల్లును ఒకసారి పరిశీలిస్తే స్కూటర్ ధర రూ.2243 మాత్రమే. కానీ, ఇప్పుడు ఆ ధరకు ఒక టైర్ కూడా రావడం లేదు. ఇక ఆ రోజుల్లో ఫియట్ కారు ధర రూ.5 వేలు. లీటర్ పెట్రోల్‌ను ( Petrol) 78 పైసలకు అమ్మేవారు. బర్కిలీ అనే కంపెనీకి చెందిన సిగరెట్ ప్యాకెట్ ధర 31 పైసలుగా ఉండేది. అలాగే, మన అందరికి బాగా ఇష్టమైన మసాలా దోశ 12 పైసలు మాత్రమే. పానీ పూరీ కూడా 12 పైసలకే వచ్చేది. ఇప్పుడు, ప్లేట్ రూ. 40 రూపాయలకు విక్రయిస్తున్నారు.
అప్పట్లో ప్రైవేట్ స్కూల్ ఫీజు రూ.12 తీసుకునే వారు. ఇక అపార్ట్‌మెంట్‌లో 1 బెడ్‌రూమ్ ఫ్లాట్ ధర రూ.19వేలు మాత్రమే.1970 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఒక్కటే ఉంది. అలాగే, విమానాల్లో ప్రయాణం చేసే వారి టిక్కెట్టు ధర రూ.70గా ఉండేది. అలాగే, ట్రెయిన్ టిక్కెట్ అయితే ధర రూ.18గా ఉండేది. ఇప్పుడు, అందరూ బైక్ లను ఎలా అద్దెకు తీసుకునే వారో అప్పట్లో సైకిల్‌ను ఒక గంటపాటు అద్దెకు తీసుకుంటే 25 పైసలు చెల్లించే వారు. ఇలా అప్పట్లో వస్తువుల తక్కువ ధరకే దొరికేవి. కానీ, అవే ఎక్కువ ధరలు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.






