ప్రపంచంలోనే తొలి అంతరిక్ష హోటల్.. స్పేస్‌లో చిల్ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్..

by Sujitha Rachapalli |

అంతరిక్షాన్ని చుట్టేయాలని ఎవరికి ఉండదు? అక్కడే కొన్ని రోజులు చిల్ అవ్వాలనే ఆశ ఎందుకు ఉండకూడదు? మనుషుల ఇలాంటి ఆలోచనలనే క్యాష్‌గా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఓ కంపెనీ. ఏకంగా మూడున్నర రోజులపాటు స్పేస్‌లో స్పెండ్ చేసే అవకాశమిస్తోంది.

ప్రపంచంలోనే తొలి అంతరిక్ష హోటల్..  స్పేస్‌లో చిల్ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్..
X

దిశ, ఫీచర్స్ : అంతరిక్షాన్ని చుట్టేయాలని ఎవరికి ఉండదు? అక్కడే కొన్ని రోజులు చిల్ అవ్వాలనే ఆశ ఎందుకు ఉండకూడదు? మనుషుల ఇలాంటి ఆలోచనలనే క్యాష్‌గా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఓ కంపెనీ. ఏకంగా మూడున్నర రోజులపాటు స్పేస్‌లో స్పెండ్ చేసే అవకాశమిస్తోంది. అవును..ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ హోటల్ త్వరలో లాంచ్ కాబోతోంది. ఒకేసారి దాదాపు 400 మంది గెస్ట్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తోంది. దీన్నే ఉపగ్రహ హోటల్ లేదా అంతరిక్ష హోటల్ అని పిలుస్తుండగా.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్ (OAC) కంపెనీకి సంబంధించిన ‘‘వాయేజర్ స్టేషన్’’ తొలి స్పేస్ హోటల్‌గా మారనుంది. వాయేజర్ స్టేషన్ అనేది తక్కువ భూమి కక్ష్యలో హోటల్‌గా పనిచేసే తిరిగే అంతరిక్ష కేంద్రం. కాగా దీన్ని 2027లో లాంచ్ చేయాలనే ప్లాన్ జరుగుతోంది. ఈ మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష హోటల్ నిర్మాణం 2026లో మొదలై.. 2027లో పూర్తి కానుంది. అదే ఏడాది అతిథులను స్వాగతించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతుంది. దాదాపు 400 మంది అతిథులు, 112 మంది సిబ్బంది ఇందులో ఉండగలరని.. ఈ స్టేషన్ ఒక తిరిగే చక్రం డిజైన్‌లో ఉంటూ కృత్రిమ గురుత్వాకర్షణను సృష్టిస్తుంది. రెస్టారెంట్లు, బార్లు, జిమ్, సినిమా హాల్, ఎక్కువ కాలం ఉండేందుకు విల్లాలు వంటి లగ్జరీ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆలోచన SpaceXకు సంబంధించిన ఫాల్కన్ 9, స్టార్‌షిప్ వంటి రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ నుంచి స్ఫూర్తి పొందినదని తెలిపింది.

ఈ ఆలోచన చాలా మందిలో మస్త్ ఎగ్జైట్మెంట్ పెంచినా.. 2027 నాటికి సాధ్యమవుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. నిర్మాణ ఖర్చు బహుశా వందల బిలియన్లనో ఉండొచ్చని.. మూడున్నర రోజుల బస కోసం సుమారు $5 మిలియన్లు ఖర్చవుతాయని చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం ఖర్చు తగ్గగలదనే వార్తలు వస్తుండగా.. క్రూయిజ్ టికెట్ ధరలకు సమానంగా తగ్గించాలని OAC ఆశిస్తోంది. ‘గ్రావిటీ రింగ్’ వంటి ప్రోటోటైప్‌లు, NASAతో ఒప్పందాల విషయంలో పురోగతి ఉన్నప్పటికీ.. కక్ష్యలో నిర్మాణం యొక్క సంక్లిష్టత, పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం వల్ల 2027లో నిజంగా సాధ్యమవుతుందా అని నిపుణులు అనుమానిస్తున్నారు. కానీ సక్సెస్ అయితే మాత్రం రిచ్ పర్సన్స్ వెకేషన్ స్పాట్‌గా మారే అవకాశం కచ్చితంగా ఉంది.

Next Story