వరల్డ్స్ బెస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. శివపార్వతుల పెళ్లి చూస్తున్నట్లే ఉందంటున్న నెటిజన్లు.. ఆ ఆలోచనే అద్భుతం గురూ..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-14 09:58:42  IST  )

ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ ఈ మధ్య కామన్ అయిపోయింది. అసలు ఫొటో షూట్ చేసుకోకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకన్నట్లుగా మారింది పరిస్థితి. లైఫ్‌లో ఒక్కసారి జరుపుకునే తంతు కాబట్టి భారీ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు జనాలు.

వరల్డ్స్  బెస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. శివపార్వతుల పెళ్లి చూస్తున్నట్లే ఉందంటున్న నెటిజన్లు..  ఆ ఆలోచనే అద్భుతం గురూ..(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ ఈ మధ్య కామన్ అయిపోయింది. అసలు ఫొటో షూట్ చేసుకోకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకన్నట్లుగా మారింది పరిస్థితి. లైఫ్‌లో ఒక్కసారి జరుపుకునే తంతు కాబట్టి భారీ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు జనాలు. ఈ క్రమంలో ఫొటోషూట్ పేరుతో నానా హైరానా చేసే కపుల్స్‌ను చూశాం. కొందరు అయితే పెళ్లి కాకముందే శోభనం అయిపోందన్నంత పని చేస్తారు. ఇలాంటి అస్సలు భరించలేని వీడియోల మధ్య ది బెస్ట్ వీడియో ప్రస్తుతం నెట్టింటిని ఏలుతుంది. వరల్డ్‌లోనే బెస్ట్ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్‌గా ప్రశంసలు అందుకుంటోంది.

నంబర్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అందుకుంటున్న వీడియోలో ఈ యంగ్ కపుల్స్ పార్వతీ పరమేశ్వరుల మాదిరిగా రెడీ అయ్యారు. మేకప్ అదిరిపోగా.. క్యూట్‌గా కనిపిస్తున్నారు. అబ్బాయి చేతిలో ఢమరుకం, మెడలో రుద్రాక్ష మాలతో కనిపించగా.. అమ్మాయి శంఖం ఊదుతూ, మెడ నిండ సొగసైన నగలతో సొగసరిగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసేందుకు కనువిందుగా ఉండగా.. చిన్న చిన్న స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా కేదార్‌నాథ్‌లో ఈ ఫొటో షూట్ జరిగినట్లు తెలుస్తుండగా.. పెళ్లి సమయంలో ఈ వీడియో చూసిన ఆ యువ జంట తమను తాము చూసుకుని మురిసిపోయారు. సంతోషంతో ఏడ్చారు. దీనిపై నెటిజన్ల రియాక్షన్ మరింత బాగుంది. ఆ ఆలోచనే అద్భుతం గురూ అంటూ కొనియాడుతున్నారు. చిల్లర వీడియోలు కాకుండా.. ఇలాంటి ట్రెండ్జ్ రావాలని కోరుతున్నారు.

Click For Tweet..

Next Story