World Laughter day: ఈ జోక్ వింటే మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం

by Dishanational2 |
World Laughter day: ఈ జోక్ వింటే మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎంతో మంది కవులు, రచయితలు నవ్వు గొప్పతనాన్ని తెలియజేశారు. ఇక నవ్వడమే కాదు నవ్వించడం కూడా గొప్ప కళ అంటారు కొందరు. నవ్వడం ద్వారా శరీరంలో ఎన్నో రోగాలు మాయమవుతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అయితే కొంత మంది అంటుంటారు నవ్వడం నాలుగు విధాలా చేటు అని, కానీ నవ్వడం నలభై విధాల ఆరోగ్యానికి మంచిదని తెలుపుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ప్రతిరోజు నవ్వాలి, నవ్వించాలి. ఇక ఈ నవ్వు గొపతనాన్ని రచయితలు మనకు ఎన్నో పాటల ద్వారా తెలిపారు.


చిరు నవ్వులతో బతకాలి, చిరంజీవీల బతకాలి, నవ్వవయ్య బాబు.. నీ సొమ్మెం పోతుంది. ఇలా ఎన్నో సాంగ్స్ నవ్వు గురించి తెలుపుతాయి. ఏంటీ నవ్వు గురించి చెబుతుంది అనుకుంటున్నారా.. ఈ రోజు నవ్వుల దినోత్సవం అందుకే నవ్విస్తున్నాను.






ప్రతి సంవత్సరం మే నెలలో తొలి ఆదివారంనాడు ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జురుపుకుంటుంటారు. ఇప్పుడు మన దేశంలోకూడా నవ్వుల దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నవ్వుల పండుగను ఆస్వాదిస్తున్నారు. అందుకే మీతో నవ్వులు పంచుకుందామని ఈ చిన్ని ప్రయత్నం.

నవ్వుల దినోత్సవం సందర్భంగా మీ కోసం చిన్న జోక్..

చదవండి.. నవ్వండి

వధువు తండ్రి శుభలేఖలో రాయించారు.. ఏమని అంటే..?

''మద్యం తాగేవారు నాకూతురి పెళ్లికి రాకుడదు అని''.. పాపం పెళ్లి కొడుకే రాలేదు..






..నవ్వితే హ్యీపీ

నవ్వకపోతే బీపీ

నవ్వని వాడు పాపి..

అందుకే నవ్వండి.. ప్రపంచ నవ్వుల దినోత్సవం శుభాకాంక్షలు


Next Story

Most Viewed