- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిడిల్ ఏజ్‌లో ఫిట్‌గా ఉండే మహిళలకు.. తర్వాత దశలో 90% తగ్గుతున్న ఆ రిస్క్..!
మిడిల్ ఏజ్‌లో ఫిట్‌గా ఉండే మహిళలకు.. తర్వాత దశలో 90% తగ్గుతున్న ఆ రిస్క్..!

దిశ, ఫీచర్స్ : వయసు మీద పడ్డాక అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో డిమెన్షియా(Dementia) ఒకటి. రోజువారీ జీవితంలో జోక్యం చేసుకునే మానసిక సామర్థ్యం తగ్గడం, మతిమరుపు వంటివి దీని లక్షణాలుగా ఉంటాయి. అయితే దానిబారిన పడకుండా ఉండాలంమీ మీరు చక్కటి శారీరక దృఢత్వాన్ని మేనేజ్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే మధ్య వయసులో (40–60 సంవత్సరాలు) అత్యంత శారీరక దృఢత్వాన్ని (Fitness) కలిగి ఉన్న మహిళల్లో ఆ తర్వాతి జీవితంలో డిమెన్షియా డెవలప్ అయ్యే రిస్క్ దాదాపు 90% తక్కువగా ఉంటుందని ఒక స్వీడిష్ అధ్యయనంలో వెల్లడైంది. మహిళల గుండె ఆరోగ్యం (Cardiovascular fitness), డిమెన్షియా రిస్క్ మధ్య సంబంధాన్ని పరిశీలించిన ఈ అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవేమిటో చూద్దాం.
అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ప్రాస్పెక్టివ్ పాపులేషన్ స్టడీ ఆఫ్ విమెన్ (PPSW)లో భాగంగా స్వీడన్‌లో 38 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసుగల 1,462 మంది మహిళలను పరిశీలించారు. వీరిలో 191 మందితో కూడిన ఒక ఆర్గనైజ్డ్ సబ్ గ్రూప్(Organized subgroup) మహిళలకు కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి స్టెప్‌వైస్-ఇన్‌క్రీస్డ్ మాక్సిమల్ ఎర్గోమీటర్ సైక్లింగ్ టెస్ట్‌లో పాల్గొనాలని సూచించారు. ఇందులో భాగంగానే మహిళల ఆరోగ్యం, డిమెన్షియా రిస్క్‌పై దీర్ఘకాలిక డేటాను సేకరించారు. అయితే అనేకమందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అత్యధిక ఫిట్‌నెస్ స్థాయి కలిగిన మహిళలు డిమెన్షియాకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని నిర్ధారించారు. ఒకవేళ వీరికి డిమెన్షియా వచ్చినప్పటికీ, ఆ లక్షణాలు యావరేజ్‌గా 79 సంవత్సరాల వయస్సులో కాకుండా, 90 సంవత్సరాల వయస్సులో, అంటే సుమారు 11 సంవత్సరాల ఆలస్యంగా కనిపించాయని పేర్కొన్నారు.
మహిళల డిమెన్షియా రిస్క్‌ను తగ్గించడంలో మిడిల్ ఏజ్ ఫిట్‌నెస్ కీ రోల్ పోషిస్తుంది. ఈ వయస్సులో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడటంతోపాటు డిమెన్షియా రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ క్రీడలు, రన్నింగ్, సైక్లింగ్, లేదా ఏరోబిక్ వ్యాయామాలు ఫిట్‌నెస్‌ను పెంచుతాయి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. మెదడుకు ఆక్సిజన్, పోషకాల సరఫరాను కూడా పెంచడంవల్ల జ్ఞాపక శక్తి పెరగడం, డిమెన్షియా రిస్క్ తగ్గడం సహజంగానే జరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం మహిళల్లోనే సాధ్యమా? అంటే అధ్యయనం కేవలం మహిళలపైనే కొనసాగింది. పురుషుల్లోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే ఉంటాయని కూడా పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.






