- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాడ్ బాయ్స్‌కే పడిపోతున్న అమ్మాయిలు.. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ..
‘అమ్మాయిలు వెధవలకే పడుతారు’ అనే ఓ సినిమా డైలాగ్ గుర్తుందా? తెరపై మాత్రమే కాదు రియల్ వరల్డ్‌లోనూ మహిళలు బ్యాడ్ బాయ్స్‌నే ఇష్టపడతారని తాజా అధ్యయనం గుర్తించింది.

దిశ, ఫీచర్స్: ‘అమ్మాయిలు వెధవలకే పడుతారు’ అనే ఓ సినిమా డైలాగ్ గుర్తుందా? తెరపై మాత్రమే కాదు రియల్ వరల్డ్‌లోనూ మహిళలు బ్యాడ్ బాయ్స్‌నే ఇష్టపడతారని తాజా అధ్యయనం గుర్తించింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 47 దేశాల నుంచి 1,300 కంటే ఎక్కువ మంది మహిళలను పురుషులను ఎంచుకోవడంలో ప్రాధాన్యతల గురించి సర్వే చేశారు. స్వల్పకాలిక రిలేషన్స్‌లో రిస్క్ తీసుకునే మగాళ్లనే ఇష్టపడతారని కనుగొన్నారు. జూదం, అతిగా మద్యపానం, గేమ్స్‌తో టైమ్ వేస్ట్ చేయడం, అసురక్షిత సెక్స్, డ్రగ్స్ తీసుకునే వ్యక్తులను ప్రేమించేందుకు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.
ఇక ఎక్కువ ఆయుర్దాయం ఉన్న దేశాల్లో నివసించే స్త్రీలు అధిక రిస్క్ తీసుకునే పురుషులను స్వల్పకాలిక సహచరులుగా చూజ్ చేసుకుంటున్నారు. ప్రమాదకర కార్యకలాపాలను ఆస్వాదిస్తున్నామని చెప్పుకునే అమ్మాయిలు.. షార్ట్ లేదా లాంగ్ రిలేషన్ కోసం రిస్క్ తీసుకునే మగవారికి ఎక్కువగా రేటింగ్ ఇచ్చారు. ఇక మజిల్ బాడీ ఉన్న మేల్ పార్ట్‌నర్‌కు కూడా తమ ఓటేస్తున్న మహిళలు.. తమాషాగా ఉండే వ్యక్తులపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.






